ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ మీడియా
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్టు వెల్లడి.
దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు కూడా మృతి.
40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ ట్రూత్లో సంచలన ప్రకటన చేశారు..ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, భద్రతా దళాలు యుద్ధం చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఖమేనీ, ఇరాన్ అగ్ర నాయకులు హతమైనప్పటికీ మరో వారం రోజులు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణవార్తను ధృవీకరించింది.
అయితే.. ఖమేనీ మరణాన్ని ఇప్పటి వరకు ఇరాన్ ధృవీకరించలేదు. అదే సమయంలో ఆయన ప్రాణాలతో ఉన్నారని కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఖమేనీ చనిపోయారే వార్తలతో ఇరాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.