కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్రెడ్డికి బుప్పగింపులు మొదలయ్యాయి. పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సంప్రదింపులు మొదలుపెట్టారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. అసలు కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేయడంపై జీవన్ రెడ్డి కొంతకాలంగా బహిరంగంగానే అసమ్మతి తెలుపుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధిష్ఠానాన్ని కోరారు. కానీ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో సమావేశానికి రావాలని రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆహ్వానించారు. కానీ ఇవాళ మీనాక్షి నటరాజన్తో జరగాల్సిన మీటింగ్కు జీవన్ రెడ్డి గైర్హాజరయ్యారు.
ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ఇంటికి ఇవాళ ఉదయం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెళ్లారు. జీవన్ రెడ్డితో అల్పాహారం చేస్తూ ముచ్చటిస్తున్నారు. కాగా, రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమయంలో మీడియాను లోపలికి అనుమతించకుండా రహస్యంగా చర్చిస్తున్నారు. కాగా, ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారని సమాచారం…