సూర్యాపేట జిల్లా..
సూర్యాపేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
పలు చర్చ్ లకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
క్రిస్మస్ సందర్బంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని నిర్మల చర్చ్, సీఎస్ఐ చర్చ్, పౌలు చర్చ్, ఆగపే చర్చ్, సిల్వి సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, మన్నా చర్చ్, బాబురావు చర్చ్, మామిడి శాంసన్ చర్చ్ లలో వేడుకలకు హాజరై కేకులు కట్ చేసి, ఆయా చర్చిల నిర్వాహకులు నూతనంగా రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండరులను ఆవిష్కరించారు. అలాగే క్రిస్మస్ విశిష్టతను, క్రిస్తూ జనాన్ని, అయన బోధనలను వివరించి.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా చర్చ్ ల నిర్వాహకులు, ఫాస్టర్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి స్వాగతం పలికి, శాలువా, బొకేలతో సత్కరించి ప్రత్యేక ప్రార్థనలతో ఆశీర్వదించారు.
*డాక్టర్ ప్రభుదాస్ ఫాస్టర్ ను సత్కరించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..*
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సెయింట్ బాప్టిస్ట్ చర్చిలో 38 ఏళ్ల పాటు ఒకే చర్చ్ లో పాస్టర్ గా పని చేసిన డాక్టర్ ఎం ప్రభుదాస్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్బంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాలువా బొకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు…
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959