జానీ మాస్టర్‌కు మరో షాక్
ఇక మీదట జానీ మాస్టర్ ఏ సినిమా చేసినా మిగతా 23 క్రాఫ్ట్స్ పని చేయబోవని స్పష్టం చేసిన ఫిల్మ్ ఫెడరేషన్
ఈ నిర్ణయం గురించి నిర్మాతలకు తెలియజేయనున్నట్లు సమాచారం
ఫిల్మ్ ఫెడరేషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని హెచ్చరిక..
గాణ ఆంధ్రప్రదేశ్ సినిమా టీవీ ఓటీటీ రివ్యూస్ టెక్ ఆటో క్రీడలు లైఫ్‌స్టైల్ ట్రావెల్ బిజినెస్ జాతీయం అంతర్జాతీయం
టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ ఎదురైంది..
గత కొద్ది రోజులుగా డాన్సర్లకి అలాగే జానీ మాస్టర్ కి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.. తాజాగా జానీ మాస్టర్ కి అనుకొని షాక్ తగిలింది.. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనను ఆల్ ఇండియా స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వార్తలు నిలవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.. ఆయనను బహిష్కరించడం పై ఇప్పటికే ఇండస్ట్రీలో పలు చర్చలు మొదలయ్యాయి.. కాస్త వివరాల్లోకి వెళితే..
జానీ మాస్టర్ కు బిగ్ షాక్..
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఫెడరేషన్ దిమ్మతిరిగే షాకిచ్చింది.. గత కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్టర్ యూనియన్ సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈనెల 14న జరిగిన అంతర్గత విచారణకు హాజరుకావాలని ఫెడరేషన్ జానీ మాస్టర్‌ను ఆదేశించింది.. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ విచారణకు హాజరు కాకపోవడంతో పెద్దలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. దీంతో ఆయనను ఫెడరేషన్ నుంచి బహిష్కరించినట్లు తెలుస్తుంది..