శివుడి మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మదర్సా ముస్లిం విద్యార్థులు…!!

జిన్నారం: మండల కేంద్రమైన జిన్నారం లోని శివాలయం సమీపంలో గల శివుడి మట్టి విగ్రహాన్ని కొంతమంది మదర్సా విద్యార్థులు మంగళవారం సాయంత్రం పగలగొట్టారు. గ్రామస్తులు మదర్సా విద్యార్థులను ప్రశ్నించారు. దీంతో వారు పరుగులు పెడుతూ జిన్నారం లోని మదర్సా లోకి వెళ్లిపోయారు. దీంతో జిన్నారం గ్రామస్తులు, యువకులు, హిందూ వాదులు భారీ ఎత్తున మదర్సా ముందు ధర్నా చేపట్టారు. శివుడి మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను తయారు చేస్తున్న మదర్సాను తక్షణమే జిన్నారం నుంచి బయటకు తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు…ఇక్కడి నుంచి మదర్సా ను తరలించే వరకు నిరసన కార్యక్రమాలు భారీ మొత్తంలో చేపడతామని గ్రామస్తులు తెలిపారు. శివుడి మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మదర్సా ముస్లిం విద్యార్థులతో పాటు, ఇందుకు సహకరించిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి డీఎస్పీ రవీందర్ రెడ్డి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న హిందూ వాదులతో మాట్లాడి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు.