జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు – రేపే అధికారిక నోటిఫికేషన్ విడుదల..
* జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కౌంట్డౌన్ ప్రారంభమైంది.
* ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) రేపు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
🔹 నామినేషన్ల స్వీకరణ: రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు
🔹 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
🔹 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 24
🔹 వోటింగ్: నవంబర్ 11
🔹 కౌంటింగ్: నవంబర్ 14
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. హైదరాబాద్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది..