సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అధిపతిగా ఉన్న డీజీపీ రామచంద్రరావు (DGP Ramachandra Rao) కొనసాగుతున్నారు. ఆయన తన కార్యాలయంలో ముగ్గురు మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. యూనిఫామ్‌లో ఉండి అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డట్లు అందులో ఉంది. కాగా డీజీపీ రామచంద్రరావు గతంలో తన సవతి కుమార్తె రాన్యా రావుకు బంగారు స్మగ్లింగ్ కేసులో సహాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ కేసుతో ఆయనను ప్రభుత్వం గతంలో సెలవుపై పంపింది. ఇటీవల ఆ తప్పనిసరి సెలవు ఉత్తర్వును రద్దు చేసి ఆయన్ను సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా బదిలీ చేసింది..
https://x.com/i/status/2013206526958436557
ప్రభుత్వ కార్యాలయంలోనే అభ్యంతరకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రారావు వ్యవహారం ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరకు చేరింది. ప్రభుత్వ కార్యాలయంలో నైతిక విలువలను ఉల్లంఘించినందుకు సదరు ఐపీఎస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావు తండ్రి ఇతడే కావడం గమనార్హం..
వివిధ సందర్భాల్లో ఆఫీసుకు వచ్చిన మహిళలను కౌగిలించుకోవడం.. ముద్దు పెట్టుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దృశ్యాలు ఈ రహస్య కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహిళలపై ఎలాంటి బలవంతం జరిగినట్లు ఆరోపణలు లేకపోయినప్పటికీ.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆఫీసులో ఇలా ప్రవర్తించడం పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే విమర్శలు నెట్టింట వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ వీడియో తనది కాదని.. లాయర్‌ను కలుస్తానని డీజీపీ రామచంద్ర రావు కొట్టిపారేశారు.
డీజీపీ రాసలీలల వివాదం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తు చేసి, వివరణ ఇవ్వాలని సంబంధిత శాఖకు సూచించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలపై దర్యాప్తు కొనసాగుతోందని.. అవి నిజమని తేలితే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
విచారణకు ఆదేశం
రామచంద్రారావు రాసలీలల వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) వరకు చేరింది. దీంతో ఆయన ఈ వీడియోలపై విచారణకు ఆదేశించారు. వీటిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక అధికారి ఇలా కార్యాలయంలో మహిళలతో అనుచితంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Karnataka DGP | స్పందించిన డీజీపీ
వీడియోలు వైరల్ కావడంతో డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఆ వీడియోలు తనవి కావని చెప్పారు. ఏఐతో సృష్టించారన్నారు. ఇదంతా ఫేక్.. తనకే షాకింగ్‌గా ఉందన్నారు. ఆ వీడియోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో తనకేమి తెలియదన్నారు. అసలు జరిగి ఉంటే కదా అన్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన హోంమంత్రి పరమేశ్వరను కలిసి వివరించారు. తన ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన కుట్రగా ఆయన ఈ సంఘటనను అభివర్ణించారు..
కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలలు వైరల్
హోంమంత్రి ఆగ్రహం, నివేదిక కోరిన సీఎం
కర్ణాటక రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు ప్రభుత్వ కార్యాలయంలో కొందరు మహిళతో ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు వచ్చినప్పటి నుండి దిగ్భ్రాంతికి గురైన కర్ణాటక పోలీస్ శాఖ
దీంతో, డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన హోంమంత్రి పరమేశ్వర్
మరియు దీనిపై నివేదిక కోరిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
మరోవైపు, ఈ వీడియోల పై స్పందిస్తూ,
ఇది ఒక సంవత్సరం క్రితం జరిగిందని.. ఇదంతా తనపై జరిగిన కుట్ర అని, దాని గురించి తనకు తెలియదని తెలిపిన రామచంద్రరావు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959