మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో 500 మందితో బిఆర్ఎస్ పార్టీలో చేరిక..
టాలీవుడ్ ప్రొడ్యూసర్, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి(Parupati Srinivas Reddy), సినీ ఆర్టిస్ట్ రవితేజ(Raviteja) బీఆర్ఎస్లో చేశారు..
ఉద్యమంలో కేసిఆర్ అడుగుజాడల్లో నడిచి మిలియన్ మార్చ్ పోరులో జైలు పాలై అనేక ఆటుపోటు మధ్యలో ఉద్యమంలో కొనసాగుతూ గులాబీ జెండాను విడవని నాయకుడు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పరిణామాల దృశ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పాలనను చూసి విసుగు చెందిన ఆయన శనివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో 500 మందితో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం కేసిఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్నది ఉద్యమ పార్టీ పాలనే అని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని నేడు సాగుతున్న ప్రజా పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు…