సిట్‌కు రిప్లై ఇచ్చిన కేసీఆర్.. రేపు సిట్ విచారణకు రాలేను..
మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరిన కేసీఆర్. విచారణ వాయిదా వేయాలని.. విచారణకు మరింత సమయం కోరిన కేసీఆర్._
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలి.. విచారణకు సహకరిస్తానన్న కేసీఆర్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న రోజున తాను విచారణకు హాజరు కాలేనని ఆయన తెలిపారు. నందినగర్‌లోని తన నివాసంలో అధికారులు నోటీసులు ఇవ్వడంపై గులాబీ అధినేత ప్రత్యుత్తరం రాశారు. శుక్రవారం విచారణ కుదరని ఆయన పోలీసులకు వివరించారు. అంతేకాదు తనను ఎర్రవల్లిలోనే మరోరోజు విచారణ చేయాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు..సిట్ అధికారులు గురువారం తనుకు నోటీసులు జారీ చేయడంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు నందినగర్‌లోని నివాసంలో అందుబాటులో ఉండాలని వారు కోరారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారమే ఆఖరు తేదీ కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంతో తాను బిజీగా ఉన్నానని విచారణను మరోరోజు జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు. జూబ్లిహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి శుక్రవారం తాను హాజరు కాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు గులాబీ బాస్..