తాగి విధులకు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుడి తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేసిన ఘటన మోతె మండలంలోని రాంపురంతండా ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది..పాఠశాలలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉపేందర్ తీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు. నిత్యం పాఠశాలకు మద్యం తాగి విధులకు ఇష్టారాజ్యంగా వస్తుంటారని ఉన్నతాధికారులకు చరవాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో తరగతులు నిర్వహించాల్సిన సదరు ఉపాధ్యాయుడికి మైకం ముంచుకొచ్చి ఏకంగా తరగతి గదిలోనే నిద్రకు ఉపక్రమించాడు. ఇది గమనించిన తండావాసులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. మైకంలో మాస్టారు తరగతి గదిలో నేలపై విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలను ఉన్నతాధికారులకు పంపారు. సదరు ఉపాధ్యాయుడి తీరుపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉన్నతాధికారులకు చిన్నారుల తల్లిదండ్రులు, స్థానిక యువకులు సోమవారం ఫిర్యాదు చేశారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.