కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఘటన…కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడి…

పోలీస్ ల సమక్షంలోనే దాడి...కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌..

కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఘటన చోటు చేసుకుంది….

విచక్షణారహితంగా ఆఫిస్ సిబ్బందిని చితకబాదిన sfi నాయకులు….

కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతో పాటు ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. కల్పేటలోని వాయనాడ్ ‌ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయానికి సుమారు 80 మంది SFI కార్యకర్తలు చేరుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారని, సిబ్బందిని దారుణంగా కొట్టారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు…దాడికి కారణమేంటో తమకు తెలియదన్నారు. బఫర్ జోన్ అంశంపై పోరాడుతున్నట్లుగా వారు చెప్పారని దీంతో రాహుల్‌ గాంధీకి సంబంధం ఏంటన్నది అర్థం కాలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళ సీఎం మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో పాటు ప్రధాని మోడీకి రాహుల్‌ గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు…

పోలీస్ ల సమక్షంలోనే దాడి…కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌…

పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. అధికార సీపీఐ ప్రమేయంతోనే ముందస్తు కుట్రలో భాగంగానే రాహుల్‌ కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ దాడి చేసిందని విమర్శించారు. రాహుల్‌ గాంధీని ఈడీ గత ఐదు రోజులుగా ప్రశ్నిస్తుందని, ఇలాంటి తరుణంలో కేరళలోని అధికార సీపీఎం ప్రభుత్వం మోదీ మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తున్నదో తమకు అర్థం కావడం లేదన్నారు. సీతారామ్‌ ఏచూరీ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు…