జనవరి 18 వ తేదిన ఖమ్మం లో జరిగే సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలి…సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి.
జనవరి 18 వ తేదిన ఖమ్మం లో జరిగే సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలి.
ప్రజల పక్షాన పోరాటాలు చేసేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమే.
అదికారం లేనప్పటికీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నాము.
స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టు లు అతివాదులుగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారు.
సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి.
జనవరి 18వ తేదీన ఖమ్మంలో సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ లో మంగళవారం ఉస్తెల నారాయణ రెడ్డి, బూర వెంకటేశ్వర్లు అద్యక్షతన జరిగిన సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుల ఆహ్వానితుల సమావేశం,
సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్ల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ 1925 లో కాన్పూర్ లో స్థాపించారని స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీజీ నాయకత్వంలో మితవాదులు పనిచేస్తుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అతివాదులు దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేశారని, ఎందరో దేశభక్తులు ఎర్రజెండాను ఎత్తుకొని దేశం కోసం అమరులయ్యారని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల ప్రభావంతో నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనలో బ్యాంకుల జాతీయకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు, భూ సంస్కరణలు వంటి అనేక నిర్ణయాలను భారతదేశంలో అమలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా కృషి చేసిందని ఆయన అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని నష్టాల పేరుతో మూసివేస్తుందని విమర్శించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ కేంద్రం 60% రాష్ట్రాలు 40 % నిదులు ఖర్చు చేయాలని కొత్తగా ఆదేశాలు జారీ చేయడం వలన పథకము నీరుగారి పోతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో మహాత్మా గాంధీ పేరుని తొలగించి జీరాంజీ పేరు ప్రవేశ పెట్టడం దురదృష్టకరమని అన్నారు.
బీహార్ లో ఎన్నికల సమయంలో ఎస్ ఐ ఆర్ పేరుతో అరవై లక్షల ఓట్లను తొలగించి బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడ పెద్దసంఖ్యలో ఓటర్లను తొలగించడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు. అటవి సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు..
అనేక పార్టీలు ఈ వందేళ్ళ కాలంలో కనుమరుగైపోయాయని కానీ కమ్యూనిస్టు పార్టీ మాత్రం అధికారం లేనప్పటికీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటుందని తెలియజేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో గెలుపొందిన 6గురు సర్పంచులు, ఇద్దరు ఉప సర్పంచ్లు, 40 మంది వార్డు మెంబర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు..
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్ ,జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఎల్లావుల రాములు, ఉస్తేల సృజన, మండవ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, ఎల్లంల యాదగిరి, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, దేవర మల్లేశ్వరి, సాయి బెల్లి, ఎస్ కె లత్తు, రామ్ రెడ్డి, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, బొమ్మగాని శ్రీనివాస్, అనంతుల మల్లేశ్వరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959