*కొండగట్టు అంజన్నా.. మా ఆర్సీబీ కప్పు కొట్టాలి*…..
ఐపీఎల్ – 2025లో ఆర్సీబీ కప్పు కొట్టాలని “Please God this year RCB won that trophy” అంటూ కొండగట్టు ఆంజనేయ స్వామికి చీటి రాసిన ఆర్సీబీ అభిమాని….
కొండగట్టు అంజన్నా.. మా ఆర్సీబీ కప్పు కొట్టాలి….ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాలుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ రాలేదు. అయితే ఈసారి కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలుస్తుందని… సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ చేస్తున్నారు. ఫైనల్ దాకా వెళ్ళిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి టైటిల్ RCB అభిమానులు రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే… ఓ అభిమాని.. చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామి చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొండగట్టు అంజన్న ను ఏది మొక్కిన… కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే.. 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవాలని… కొండగట్టు అంజన్న హుండీలో ఆర్సిబి అభిమాని ఒక చిట్టి రాసి వేశాడు. ఐపీఎల్ – 2025లో ఆర్సీబీ కప్పు కొట్టాలని “Please God this year RCB won that trophy” అంటూ కొండగట్టు ఆంజనేయ స్వామికి చీటి రాసిన ఆర్సీబీ అభిమాని.. అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టిల్ ఎగరేసుకుపోతుందని అంచనా వేస్తున్నారు…