*🔹కోటా శ్రీనివాసరావు కన్నుమూత*
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు.
లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న జన్మించారు.
1978లో ‘ప్రాణం ఖరీదు’తో నటప్రవేశం చేశారు. ఇప్పటివరకు ఆయన తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 750కుపైగా సినిమాల్లో నటించారు.
విలన్, కామెడీ, తండ్రి, తాత, మామ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు.
ఆయన కెరీర్లో 9 నంది అవార్డులు అందుకున్నారు. కోట చివరిసారిగా ‘కబ్జా’ మూవీలో కనిపించారు.
*కోటా శ్రీనివాసరావు వ్యక్తిగత జీవితం*
కోటా శ్రీనివాస రావు తన నటనతో తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచడంతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు.
1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2015లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఈయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో పని చేసేవారు.
1966లో రుక్మిణితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు…