ప్ర‌జాసేవ‌కు అంకిత‌మైన రాకేశ్ రెడ్డికి ఓటేద్దామా..? మీడియా, యూట్యూబ్ అడ్డం పెట్టుకుని దందాలు చేసే చీట‌ర్ కు ఓటేద్దామా..? కేటిఆర్.

హుజూర్ నగర్ లో చెత్త పోయింది....

సూర్యపేట.. జిల్లా..
….హుజుర్ నగర్ ..టౌన్ లో.

గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశం..
ముఖ్యఅతిథిగా హాజరైన BRS వర్కింగ్ ప్రెసిడెంట్,
మాజీ మంత్రి
KTR…
మాజీ మంత్రి
సూర్యపేట MLA..జగదీష్ రెడ్డి..
మాజీ మంత్రి
శ్రీనివాస్ గౌడ్…mlc.mc. కోటిరెడ్డి,,,.
ఒంటెద్దు నరసింహ రెడ్డి…
MLC అభ్యర్థి రాకేష్ రెడ్డి..
జిల్లా మాజీ MLA లు. మాజీ MP లు. మాజీ MLC లు..ఇతర ప్రజాప్రతినిధులు..

కేటిఆర్ మాట్లడుతూ..
హుజూర్నగర్ లో చెత్త పోయింది.. నికాసేన ఉద్యమకారులు పార్టీనీ నిలబెడుతున్నారు.. మధ్యలో వచ్చారు మధ్యలో వెళ్లారు పోయిన వాళ్ల గురించి మాట్లాడటం కూడా సమయం వృధా.. ఉన్న నాయకులకి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది…

నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
2 ల‌క్ష‌ల ఉద్యోగాల మాటే లేదు.. నిరుద్యోగ భృతి ఊసే లేదు అని కేటీఆర్ మండిప‌డ్డారు. న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన‌ ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు..
ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 4 ల‌క్ష‌ల 70 వేల మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఉన్నారు. మ‌రి అర‌చేతిలో వైంకుఠం చూపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా..? ప‌దేండ్ల పాటు నిజాయితీగా ప‌ని చేసిన బీఆర్ఎస్‌కు ఓటెద్దామా..? ఒక గోల్డ్ మెడ‌ల్ సాధించి ప్ర‌జాసేవ‌కు అంకిత‌మైన రాకేశ్ రెడ్డికి ఓటేద్దామా..? మీడియా, యూట్యూబ్ అడ్డం పెట్టుకుని దందాలు చేసే చీట‌ర్ల‌కు ఓటేద్దామా..? అనేది ఆలోచించాల‌ని ప‌ట్ట‌భ‌ద్రుల‌కు కేటీఆర్ సూచించారు.

మెగా డీఎస్సీ ముచ్చ‌ట‌నే లేదు..

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం.. జాబ్ క్యాలెండ‌ర్ లేదు. మెగా డీఎస్సీ ముచ్చ‌ట‌నే లేదు. ఇప్ప‌టికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాన‌ని రేవంత్ అంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి వ‌చ్చాక ఒక్క నోటిఫికేష‌న్ కూడా రాలేదు. ఉద్యోగాలు ఇచ్చామ‌ని డైలాగులు కొడితే న‌మ్మేందుకు మ‌నం పిచ్చొళ్లామా..? కాంగ్రెస్ చెప్పిన 2 ల‌క్ష‌ల ఉద్యోగాల మాటే లేదు. మీ త‌ర‌పున కొట్లాడాలి అంటే మాకు బ‌ల‌మివ్వాలి. కానీ బాకాలు ఊదేవాళ్ల‌కు కాదు అని కేటీఆర్ చెప్పారు…

తెల్లారి లేస్తే బూతులు, పెద్ద వాళ్ల‌ను తిట్ట‌డం, బెదిరించ‌డం, బ్లాక్ మెయిల్ చేయ‌డం కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ని. ఆయ‌న‌పై 56 కేసులు ఉన్నాయి. ఇవి ఆయ‌న‌ గుణ‌గ‌ణాలు.. మ‌రి బిట్స్ పిలానీలో చ‌దివి స‌మాజం మీద అవ‌గాహ‌న ఉన్న విద్యావంతుడికి ప‌ట్టం క‌డుతారా..? బ్లాక్ మెయిల‌ర్‌కు ప‌ట్టం క‌డుతారా…? అనేది ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించుకోవాలి. ఈ ఎన్నిక‌తో ప్ర‌భుత్వం కుప్ప‌కూలేదేమీ లేదు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే నాయ‌కుడు కావాలి. మండ‌లిలో బాకా ఊదేటోళ్లు ఉండొద్దు. ప్ర‌భుత్వం భాజా బ‌జాయించి గొంతు విప్పి ప్ర‌శ్నించేటోళ్లు, నిల‌దీసేటోళ్లు కావాలి అని కేటీఆర్ అన్నారు.

మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇలాంటి చీట‌ర్ల‌కు, బ్లాక్ మెయిల‌ర్ల‌కు స‌పోర్ట్ చేస్తే.. రేపు మీకే ఎస‌రు పెడుతార‌న్న మాట‌ను కూడా వారు గుర్తుంచుకోవాలి. స‌మాజానికి ప‌ట్టిన చీడ‌పురుగులు, బ్లాక్ మెయిల‌ర్ల‌ను, క్రిమిన‌ల్ కేసులు ఉన్న వ్య‌క్తిని ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎలా ప్ర‌కంటించింది అని కేటీఆర్ ప్ర‌శ్నించారు..