ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం…!

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు..చంద్రబాబు నాయుడు పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు చేస్తున్నది భారీ స్కాం అని తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

”మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కానీ, మీరెందుకు ఆ పనిచేయడంలేదు? మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా?

▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు.
▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు!
▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం!
▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ
▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి.
భూములు ప్రభుత్వానివి..! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి” అని ప్రశ్నించారు..