గ్రేటర్ బీఆర్ఎస్‌ నేతలతో కేటీఆర్‌ సమావేశం..

గ్రేటర్ బీఆర్ఎస్‌ నేతలతో కేటీఆర్‌ సమావేశం..

_• హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక నిర్ణయం…_

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు..

ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. విప్ కూడా ఇస్తాం..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటుకు వెళ్లొద్దు….కేటీఆర్..

గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో బీఆర్‌ఎస్‌(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమై సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించినట్లుగా తెలుస్తుంది… నగరం నుంచి భారీ ఎత్తున వరంగల్‌లోని ఎల్కతుర్తికి తరలివెళ్లాలని భావిస్తున్నారు.