విఫలమైన ప్రయోగంలోనూ అద్భుతం…ఆ శాటిలైట్ అనూహ్యంగా పనిచేయడం

కొత్త సంవత్సరంలో చేసిన మొదటి మిషన్ PSLV-C62 జనవరి 12న శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది. ఈ మిషన్‌లో ప్రధాన పేలోడ్.. DRDO స్ట్రాటజిక్ ఇమేజింగ్ సాటిలైట్ EOS-N1(అన్వేష)తో పాటు మొత్తం 16 శాటిలైట్లు పైకి తీసుకెళ్లింది..కానీ.. రాకెట్ థర్డ్ స్టేజ్(PS3)లో అనోమలీ(తప్పు) దొర్లడంతో రాకెట్ పాత్ డీవియేట్ అయి ఆర్బిట్‌లోకి చేరలేకపోయింది. ఫలితంగా అన్ని శాటిలైట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఈ వైఫల్యం మధ్య ఓ సానుకూల విషయం జరిగింది. స్పానిష్ స్టార్టప్ Orbital Paradigmకు చెందిన Kestrel Initial Demonstrator(KID) అనే 25 కిలోల ఫుట్‌బాల్ సైజు ప్రొటోటైప్ శాటిలైట్‌నూ PSLV-C62 ద్వారా అంతరక్షంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ శాటిలైట్ అనూహ్యంగా పనిచేయడం ప్రారంభించింది. రాకెట్ నుంచి విడిపోయిన ఈ బుల్లి శాటిలైట్.. తీవ్రమైన రీ-ఎంట్రీ పరిస్థితులను(పీక్ డెసెలరేషన్ 28g, అధిక ఉష్ణోగ్రతలు, థర్మల్ స్ట్రెస్) తట్టుకుని, 3 నిమిషాలకుపైగా అంతరిక్షం నుంచి ఇంటర్నల్ టెంపరేచర్లు వంటి కీలక డేటా భూమికి పంపింది…

అయితే రాకెట్ విఫలమైనా..స్పానిష్ శాటిలైట్ KID మాత్రం పనిచేస్తూ డేటాను పంపుతోంది. ఇది ISROకు కొంత సానుకూలమైన విషయం.ఇది PSLV విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తించినప్పటికీ ఈ చిన్న అద్భుతం ISROకు కొంత సాంకేతిక సమాచారాన్ని అందించగలదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959