ఫార్ములా ఈ-రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్లు అంశం మరింత కాక పు టిస్తున్నది. బిఆర్ఎస్కు దశల వారీగా రూ.49 కోట్ల మొత్తాన్ని గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు రూపంలో ఇచ్చిందని కాంగ్రెస్ తాజాగా ఆరోపణలు చేసింది….
ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో తనపై అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో జరిగిన తాజా పరిణామాలపై కేటీఆర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు…ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు.. ఈ ఆరోపణలు నన్ను తగ్గించలేవు.. మీ చర్యలు నా గమ్యాన్ని మార్చలేవు.. కుట్రలతో నా నోరు మూయించలేరని కేటీఆర్ తెలిపారు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని.. న్యాయమే గెలుస్తుందని అచంచలమైన నమ్మకం ఉందని చెప్పారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుందని అన్నారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్లోని తన నివాసంలో తన లీగల్ టీమ్లో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది..