Letest news… ప్రధాన వార్తలు…

ఢిల్లీ: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు సమావేశం

40 నిమిషాలపై కొనసాగిన సమావేశం
అభివృద్ధి పనులను ప్రధానికి వివరించిన చంద్రబాబు..ఈనెల 16న కర్నూలులో జరగనున్న సూపర్ GST సభకు ఆహ్వానం.
నవంబర్‌లో జరిగే CII వాణిజ్యసదస్సుకు మోదీకి ఆహ్వానం..

కొండా సురేఖతో మాట్లాడాను-మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు-పొంగులేటి.

ఇతర కార్యక్రమాలు ఉన్నందున..
మేడారంపై సమీక్షకు రాలేనని సురేఖ చెప్పారు.
నాపై ఎవరికీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు
కొండా సురేఖ, సీతక్క ఇద్దరూ నాకు అక్కలు-పొంగులేటి అన్నారు..

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ట్రంప్‌కు నిరసన సెగ.

ట్రంప్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న ఇద్దరు ఎంపీలు
ఇద్దరు ఎంపీలను బయటకు పంపిన మార్షల్స్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను అడ్డుకున్నందుకు ఇజ్రాయెల్ పార్లమెంటులోని ఇద్దరు సభ్యులను సోమవారం సభ నుండి తొలగించారు. ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ గురించి మాట్లాడుతున్న హడాష్ పార్టీ నాయకుడు అయ్మాన్ ఒదేహ్ మరియు పార్టీ ఎంకే ఓఫర్ కాసిఫ్‌లను బయటకు తీసుకెళ్లారని ది జెరూసలేం పోస్ట్ నివేదించింది..ట్రంప్ ప్రసంగం సందర్భంగా “పాలస్తీనాను గుర్తించండి!” అని రాసి ఉన్న బోర్డులను పట్టుకున్నందుకు నిరసనకారులను నెస్సెట్ నుండి తొలగించారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది..ఇజ్రాయెల్‌లోని హడాష్ పార్టీకి చెందిన అరబ్-ఇజ్రాయెల్‌కు చెందిన అయిమాన్ ఉడా, అతని సహోద్యోగి యూదు ఇజ్రాయెల్‌కు చెందిన ఓఫర్ కాసిఫ్‌గా గుర్తించారు. ట్రంప్ తన ప్రసంగంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు..

రేవంత్ రెడ్డి తీరుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నాడన్న వార్తలపై స్పందించిన అనిరుధ్ రెడ్డి

సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని కోసం చంపిన చరిత్ర ఎర్ర శేఖర్‌ది

రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు

పార్టీకి మోసం చేసి మూటలు తీసుకొని వెళ్లిన వారికి మళ్ళీ ఎంట్రీ లేదు అని అనిరుద్ రెడ్డి అన్నారు..

అనిరుధ్ వ్యాఖ్యలను నేనుఏకీభవిస్తున్న-మధుసూదన్‌రెడ్డి..

పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి..
రూ.25 కోట్లు కేటాయించాలని అడగడంలో తప్పులేదు..గత పదేళ్లలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైంది.అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతోనే అడిగి ఉంటారు..రైతు పండుగ వేదికగా పాలమూరు జిల్లాకు..ఏడాదికి రూ.20 వేల కోట్లు ఇస్తామని సీఎం చెప్పారు
అందులో భాగంగానే అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించి ఉంటారు అని-దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి.. అన్నారు..

మీర్‌పేట్‌ మాధవి హత్య కేసు
హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు.

హైదరాబాద్‌: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసు
హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
ఈ నెల 17 నుంచి రోజువారీ ట్రయల్‌ జరపనున్న కోర్టు..మాధవిని ముక్కలు..ముక్కలు చేసి హత్యచేసిన గురుమూర్తి..సైంటిఫిక్‌ ఆధారాలు కోర్టుకు సమర్పించిన పోలీసులు
రెండు నెలల్లో తీర్పు వస్తుంది-రాచకొండ సీపీ సుధీర్‌.

ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధర.

రూ.1.28 లక్షలకు చేరిన తులం బంగారం
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,110.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,630.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,83,300.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో 250 ఓట్లు, 180 ఓట్లు, 80 ఓట్లు, 90 ఓట్లు ఉన్నాయి.. కేటీఆర్.

ఇలా మొత్తం 14–15 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది..

ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే, ఆ ఇంటి యజమాని వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు..

ఇంకో ఇంటికి వెళ్ళి చెక్ చేశాం.. వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి..

ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు.. ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి..
జూబ్లీహిల్స్‌లో చోర్ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుంది

ఇటీవలే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓటరు ఐడీ కార్డులు పంచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసులు కూడా నమోదు అయ్యాయి

ఇప్పుడు దొంగ ఓట్లను నమోదు చేయించి గెలవాలని చూస్తున్నారు.. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం అన్నారు.

ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈవోకు ఫిర్యాదులో ఇచ్చాం – కేటీఆర్ అన్నారు…