హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదు..రంగనాథ్..
మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్, కూల్చివేతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) స్పష్టం చేశారు. పలు సంస్థలు పనిగట్టుకొని హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైడ్రాకు సంబంధం లేని విషయాలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు.
రామంతాపూర్(Ramanthapur)లో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మరణించగా.. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇంటిని మార్క్ చేశారన్న ఆందోళనతో చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రంగనాథ్(Ranganath) మూసీ మార్కింగ్, కూల్చివేతలపై మరోసారి స్పష్టతనిస్తూ హైడ్రాకు సంబంధం లేదని పేర్కొన్నారు…
మరో ప్రాణం తీసిన హైడ్రా కూల్చివేతల భయం
ఇల్లు కూల్చేస్తారన్న భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్ – రామంతాపూర్‌లోని లక్ష్మీనారాయణ కాలనీ, కేటీఆర్ నగర్లో రవీందర్ అనే వ్యక్తి ఇంటికి మార్కింగ్ చేసిన హైడ్రా అధికారులు.. దీంతో ఇల్లు కూల్చేస్తారన్న భయంతో గుండెపోటుతో రవీందర్ మృతి.
నాలుగు రోజులు పాటు ధరణి సేవలు నిలిపివేత..!
ధరణి పోర్టల్ సేవలు సాంకేతిక కారణాల రీత్యా నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవని ప్రధాన భూ పరిపాలనా కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 12వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ సోమవారం ఉదయం వరకు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ధరణి పోర్టల్ డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఈ అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. సాంకేతిక సమస్యల వల్ల తలెత్తిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సోమవారం ఉదయం నుంచి సేవల పునరుద్ధరణ ఉంటుందని వివరించింది. ధరణి పోర్టల్ డిసెంబరు 1 నుంచి జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) నిర్వహణలోకి వచ్చిన విషయం విదితమే…
*కేటీఆర్ పై కేసు.. గవర్నర్ ఆమోదం? అరెస్ట్ చేస్తారా?*
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది. ఫార్ములా ఇ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆమోదం లభించిన తర్వాత రాజ్ భవన్ నుంమచి ప్రభుత్వానికి ఫైలు చేరినట్లు సమాచారం. ఫార్ములా ఇ రేస్ వ్యవహారంలో హెచ్ఎండీఏ కు సంబంధించిన నిధులను మంత్రి వర్గం ఆమోదం లేకుండా కేటీఆర్ నేరుగా నిధులను మళ్లించారని అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకుండా రెండు విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారని ఆరోపణలున్నాయి..
*_రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్: ఏడాదిన్నరలో 1.45 లక్షలకుపైగా కేసులు..!!_*
ఇందులో 2 వేల కంటే ఎక్కువ మంది మృతి
నాలుగేండ్లలో టీబీ బారిన 2.70 లక్షల మంది
2025 కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం
సర్కారుకు సవాల్‌గా తాజా గణాంకాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో టీబీ (క్షయ) వ్యాధి విజృంభిస్తున్నది. సైలెంట్ కిల్లర్‌గా భావించే ఈ వ్యాధి నియంత్రణకు గడిచిన 50 ఏండ్లుగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. -ఏడాదిన్నరలో 1.45 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, -ఇందులో 2 వేల మందికిపైగా మృతి చెందారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ రాష్ట్రంలో 70,546 మంది టీబీ బారిన పడినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే పది నెలల్లో ఈ వ్యాధి కారణంగా 1,004 మంది మృతిచెందారు. నిరుడు అత్యధికంగా 74,986 మంది టీబీ బారిన పడగా, 1,659 మంది కన్నుమూశారు. 2022లో 72,391 మంది, 2021లో 59,947 మంది క్షయ బారిన పడగా.. వరుసగా1,892 మంది, 2,055 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా టీబీ కారణంగా ఏటా 5లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా టీబీ మరణాల సంఖ్య తగ్గుతున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం దడ పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో 2025 నాటికి టీబీని పూర్తిగా అంతం చేయాలని కేంద్రప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి తాజా గణాంకాలు సవాల్‌గా మారాయి.
*_గుర్తింపులో జాప్యం.._*
ప్రజలు దీర్ఘకాలిక జ్వరాలు, దగ్గు, జలుబును సాధారణ ఇన్ఫెక్షన్ లాగానే భావిస్తున్నారు. రాత్రిళ్లు ఒళ్లంతా చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం జనరల్ ప్రాబ్లమే అనుకొని, ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. ఇలా చాలా వరకు క్షయ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. టీబీకి చికిత్స చేయకుండా వదిలేస్తే.. క్రమంగా ఊపిరితిత్తులకు చిల్లులు పడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న టీబీ కేసుల్లో 80 శాతం కేసులు లంగ్స్పై ప్రభావం చూపుతున్నవే. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ప్రభుత్వం ఇల్లిల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్నా.. కేసులు బయటకు రావడం లేదు.
సర్వేలు నామమాత్రంగానే చేస్తుండడమే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, టీబీ అంటువ్యాధి కావడంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రారంభ దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించకపోవడం వల్ల వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మినప్పుడు సూక్ష్మ బిందువులు గాలిలోకి విడుదలై.. ఇతరులకు వ్యాధి సంక్రమిస్తున్నది. అలాగే, ఎవరికైనా క్షయ నిర్ధారణ జరిగినప్పుడు వారితో ఉన్న కాంటాక్ట్ కేసులను ట్రేస్ చేయడంలో మెడికల్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కొన్ని రోజుల తర్వాత కాంటాక్ట్ కేసులు కూడా వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఎండీఆర్ టీబీ కేసులు..
క్షయ ప్రమాదకర అంటువ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి, చికిత్స అందిస్తే దానిని నివారించవచ్చు. టీబీ చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు 6 – 9 నెలల పాటు వివిధ రకాల మందులను అధిక మొత్తంలో వాడాల్సి ఉంటుంది. అప్పుడుగానీ శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాదు. కానీ చాలా మంది ఒకటి, రెండు నెలలు వాడగానే లక్షణాలు తగ్గిపోవడంతో మందులను పక్కకు పెట్టేస్తున్నారు.
దీంతో బ్యాక్టీరియా మరింత పుంజుకొని, ఆ వ్యక్తిపై తీవ్రంగా ఎటాక్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ఆ రోగుల్లో టీబీ కాస్తా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ(ఎండీఆర్-టీబీ)గా మారుతున్నదని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి వారి విషయంలో మందులు కూడా పనిచేయక పోవచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల టీబీ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన కోర్సులను పూర్తిగా వాడాలని సూచిస్తున్నారు.
*_పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి_*
టీబీ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే క్షయను నివారిం చవచ్చు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి, చికిత్స అందివ్వడం ద్వారా వేరొకరికి సోకకుండా అడ్డుకోవచ్చు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులపై త్వరగా అటాక్ చేస్తుంది.
డయాబెటిస్, హెచ్ఐవీ, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, పొగాకు ఎక్కువగా వినియోగించేవారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండ డం వల్ల టీబీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. టీబీ వ్యాధి సోకితే వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించాలి.
*_ప్రజల్లో అవగాహన రావాలి_*
టీబీపై ప్రజల్లో అవగాహన లేక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండు వారాలకు మించి జ్వరం, కఫంతో కూడిన దగ్గు, చాతి నొప్పి, రాత్రిళ్లు చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే మీ కుటుంబ సభ్యులను వ్యాధి బారిన పడేసినవారవుతారు. ప్రభుత్వాలు సైతం టీబీ లక్షణాలు, చికిత్స, ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. టీబీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.
– *_డాక్టర్ ఎం. రాజీవ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్_*
జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1 శాతం నుంచి 1.5 శాతానికి పెరుగుతుంది…మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.
జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1 శాతం నుంచి 1.5 శాతానికి పెరుగుతుందన్నారు. ఇది ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయమని తెలిపారు. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహించాలన్నది ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని, దేశ ప్రజలందరి కోరిక అని కోవింద్ చెప్పారు. అయితే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీల ఆమోదం పొందాలని సూచించారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది సెప్టెంబరులోనే ఆమోదించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతోపాటు ఆ తరువాత 100 రోజుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
*🔹తమిళనాడులో భారీ వర్షాలు*
మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
చెన్నై, మధురై, సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు..
10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
పొంగిపొర్లుతున్న జలపాతాలు.. పర్యాటకులకు అనుమతి నిషేధించిన ప్రభుత్వం..
అల్లు అర్జున్ అరెస్ట్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు..
*సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్?*
సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీ సులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
మరోవైపు, కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటన లో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనే జర్, మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది…