లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు..

TG: హైదరాబాద్లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్టెల్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.