కంచె గచ్చిబౌలి వాస్తవాలను ఏఐకు ముడిపెట్టడం హాస్యాస్పదం.. నెమల్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు కుడా ఏఐ సృష్టేనా… మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

*సూర్యాపేట జిల్లా..*

సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ లో అయన మాట్లాడినట్లు ప్రకటనలో వచ్చిన విషయాలపై స్పందించిన మాజీమంత్రి,, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి..

కంచె గచ్చిబౌలి వాస్తవాలను ఏఐకు ముడిపెట్టడం హాస్యాస్పదం..

నెమల్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు కుడా ఏఐ సృష్టేనా..

రేవంత్ తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగార్చేలా వుంది..

సీఎం స్థాయిలో జరగాల్సిన రివ్యూ లా లేదు..

ఆయన తీరుకు సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నరు..

అధికారులు, అనుచరులు ఇస్తున్న సలహాలపై పునరాలోచన చేసి మాట్లాడితే మంచిది..

సుప్రీమ్ కోర్టు ఆదేశాలను దిక్కరించడం రేవంత్ పనిగా పెట్టుకున్నాడు..

ఏ ఐ యూనివర్సిటీ పెడతానన్న రేవంత్ ఆవిషయంలో ముందుకు సాగుతాడా..

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కన్నా మీ అనుముల ఇంటెలిజెన్స్ నుమ్ముకోవడమే మంచిది..

వాళ్లిచ్చే బ్రిఫ్ ను నమ్ముకుని నవ్వులపాలవుతున్నారు..

AI కంచె గచ్చిబౌలి లో పుట్టిందా..

అక్కడ ఊర కుక్కలు జింకలను చంపింది AI సృష్టేనా..

లేనివి సృష్టించడమే.. తప్పుడు ప్రచారాలు చేయడం కాంగ్రెస్, రేవంత్ కు అలవాటే..

అసలు కంచె గచ్చిబౌలి విషయంలో రాజకీయాలు మాట్లాడలే..

ఒకవైపు రాష్ట్రం నష్టపోతుంది.. జరిగిన అభివృద్ధి అంతా వెనక్కి పోతుందనే బాధ..

దీనికి తోడు జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని బాధ తప్ప మరొకటి లేదు..

చైనా, పాకిస్తాన్ యుద్దాలకు ఇక్కడ AI కి సంబంధం ఏమిటి..

ఆవిషయాన్నీ గురించి అనేకమంది మాతో చెప్పి నవ్వుకుంటున్నారు..

ఈ విషయంలో కోర్టుకు పోతమంటే వాళ్లకు చివాట్లు తప్పవు..

జబ్బును గుర్తించకుండా మందులు వాడతామన్న తీరులా రేవంత్ పోకడ..

సుప్రీమ్ కోర్టు సుమోటోగా తీసుకున్నప్పుడే వాళ్ళ ఆలోచన మార్చుకోవాల్సింది..

యూనివర్సిటీనే మార్చుతామన్నా రేవంత్ లీకులుకూడా అనాలోచితమే..

అసలు ఆ కొత్తగా యూనివర్సిటీ అనుకుంటున్న దగ్గరే 400 ఎకరాలు కూడా ఇచ్చుకోవచ్చుకదా..

విద్యార్థులు, ప్రజలను తక్కువ అంచనా వేయడం సరికాదు..

రేవంత్ ఇప్పటికైనా తెలివితక్కువ పనులు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది..