మాచర్లలో ప్రేమ జంటల వీడియోలు తీసి ఏఎస్ఐ నిర్వాకం..
ఏకాంతంగా ఉన్న జంటల వీడియో తీసి బెదిరించి డబ్బులు వసూలు. ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధింపులు చేసేడు అంటూ పలు ఆరోపణలు..
https://x.com/YSRCParty/status/2042857270305001654?s=20
జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీయిస్తున్న ఏఎస్ఐ
Andhra Pradesh Police.
ఎవరైనా ఫిర్యాదు చేస్తామంటే.. అధికార నేతల సపోర్ట్ ఉంది.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ బెదిరింపులు . పలువురు ఆరోపణలు..
పల్నాడు జిల్లా మాచర్ల ఎఎస్సై శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీడియోలు చూపించి, కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏఎస్సై నిర్వాకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ అంశం పోలీసు ఉన్నతాధికారుల దఅష్టికి వెళ్లడంతో విచారణ జరిపి చర్యలు చేపట్టారు. మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు. కళాశాల విద్యార్థులు కూడా సరదాగా గడిపేందుకు వస్తుంటారు. వారిని సదరు ఏఎస్సై వీడియోలు తీయిస్తూ.. స్టేషన్కు పదండి అంటూ భయపెట్టి నగదు వసూలు చేసేవారు. అంతటితో ఆగక.. తన కోరిక తీర్చాలంటూ యువతులను బెదిరించేవారు. మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఓ ఆటోడ్రైవర్ చేత ఈ వీడియోలు తీయించేవారు. జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. మాచర్లలో ఓ వ్యాపారి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తీసి, వారిని బెదిరించి పలు దఫాలుగా డబ్బు వసూలు చేశారు. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇదే పంథాలో వెళుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..