మహాకుంభ మేళ మృత్యుకుంభ్ గా మారనుందంటూ మండిపడ్డ దీదీ.

Mamata Banerjee :
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై కూడా అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమత తప్పుపట్టారు. నిర్వహణా లోపాల వల్ల మహాకుంభ ‘మృత్యుకుంభ్’‌గా మారుతోందంటూ విమర్శించారు.

ఇది మృత్యుకుంభ్… నేను మహాకుంభ్‌ను గౌరవిస్తాను, గంగామాతను గౌరవిస్తాను. కానీ అక్కడ సరైన ప్లానింగ్ లేదు. ఎంతమంది కోలుకున్నారు? డబ్బున్న వాళ్లు, వీఐపీలకు క్యాంపులు (టెంట్లు) దొరుకుతున్నాయి. పేదలకు ఎలాంటి ఏర్పాట్లు లేవు.

మేళాలో తొక్కిసలాట జరగడం సహజమే అయినా అలా జరక్కుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. అందుకు మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు” అంటూ కేంద్రం, యూపీలోని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని మమత నిలదీశారు.