*భక్తిశ్రద్ధలతో కృష్ణా నదిలో స్నానం చేసే అవకాశం కూడా లేకుండా చేసిన ఇండస్ట్రీ…!*
*మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశా..!*
కృష్ణానది నీటితో స్నానం చేసి, స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి అంటారు..
*కానీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లి, బోర్ నీటితో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి దాపురించింది..*
*ఇందుకు కారణమైన కృష్ణానది పరివాహక ప్రాంత ఇండస్ట్రీపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు..!?*
*అధికారుల అలసత్వం పై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..*
*మైనింగ్ శాఖ, పొల్యూషన్ శాఖ మొద్దు నిద్రలో ఉన్నారు అంటూ ఆరోపణలు…*
*మూసీ నది కంటే ఘోరంగా కృష్ణ నది..*
*కిష్టపట్టే సిమెంట్ ఫ్యాక్టరీ పై విచారణ చేపట్టారా..!?*
*ఎక్కడి నుంచో కెమికల్ నీరు తీసుకొచ్చి పోశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి మీడియానే తప్పు దోవ పట్టించారా..!?*
*ఈ కిష్టపట్టే ఇండస్ట్రీపై చర్యలు తీసుకోవాలంటే సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి దిగిరావాలా..!?*
*కృష్ణానది నుండి మిషన్ భగీరథ నీరు అందిస్తున్న నీరు తాగి ఎంతమంది బలి కావాలి..?*
*ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇన్ని రోజులు జరుగుతున్న ఈ కలుషితంపై కనీసం పర్యావరణ ప్రేమికులు కూడా స్పందించకపోవడం శోచనీయం..*
*ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు వచ్చే ఎన్జీవో సైతం ఇప్పుడు ఏం చేస్తున్నట్లు..?*
*పరివాహక ప్రాంతం వద్ద ఉన్న ఇండస్ట్రీపై ఎందుకు విచారణ జరిపించారు..?*
*ఇలా సర్వత్ర ఎన్నో విమర్శలు…*
*ఆ లక్ష్మీనరసింహస్వామి అన్ని చూసుకుంటారేమో.. వేచి చూద్దాం.. అంటు సోషల్ మీడియాలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేస్తున్నారు….
సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా నీటి కాలుష్యంపై నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు…