శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం మట్టపల్లి గోశాలకు పశుగ్రాసం అందజేత..

సూర్యాపేట జిల్లా..

అబ్బిరెడ్డిగూడెం.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం మట్టపల్లి గోశాలకు పశుగ్రాసం అందజేత..

మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని రాజ్యలక్ష్మి గోశాలలోని గోవులకు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్న విషయం తెలుసుకొని గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ రైతు రేవూరి సాయి కిరణ్ మరియు అతని తండ్రి రేవూరు గోపాల్ రైతు పశుగ్రాసం(వరిగడ్డి)ని మంగళవారం గోశాలకు అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశాలలోని గోవులు పశుగ్రాసం లేక ఇబ్బంది పడుతున్నాయని తెలిసి దాదాపు 10 వేల రూపాయల విలువగల వరి గడ్డిని స్వయంగా తామే తమ ట్రాక్టర్లలో అన్ని ఖర్చులు భరించి తీసుకువెళ్లి గోశాలకు అప్పగించామన్నారు.

ఆకలితో అలమటించే మూగజీవాలకు గడ్డిని అందించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.ఎవరైనా పశుగ్రాసం అందించే దాతలు ఉంటే వారి చుట్టుపక్కల మేత లేక ఇబ్బంది పడే గోశాలకు పశుగ్రాసం అందించాలని కోరారు. ఇట్టి పవిత్ర కార్యంలో అబ్బిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ ఎడవెల్లి ఉపేందర్ రెడ్డి, పందిరి వెంకటరెడ్డి, రేవూరి వెంకటేశ్వర్లు, పందిరి రఘు, ఎడవల్లి వెంకటరెడ్డి, కొమ్ముజాడ నవీన్, టేకుమట్ల వెంకన్న, రేవూరి రాము, ఎస్కే రంజాన్, పెండెం సందీప్ మొదలైన వారు పాల్గొన్నారు..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959