మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారు..మేధా పాట్కర్‌ లేఖ…

మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆమె సీఎంకు ఘాటైన లేఖ రాశారు. సీఎంతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, జైరామ్‌ రమేశ్‌, మీనాక్షీ నటరాజన్‌కు ఆ లేఖను పంపారు….13న మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను విడుదల చేసే కార్యక్రమానికి ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ మేధా పాట్కర్‌ను ఆహ్వానించారు. అయితే ఆమె ఇటు ప్రభుత్వానికి, అటు ఎంఆర్‌డీసీఎల్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవనానికి తాను వ్యతిరేకం కాదని, ప్రజలను హింసిస్తూ.. అభివృద్ధి చేస్తామంటే అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టును సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నుంచి పూర్తిగా మినహాయించారని ఎత్తిచూపారు..