సూర్యాపేట జిల్లా బూరుగడ్డ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ, అనంతరం గానుగబండ, కల్మలచెరువు గ్రామాలలో పలు రోడ్డు నిర్మాణాల, శంకుస్థాపన,, పాలకు వీడు మండలంలో ఆలింగాపురం గ్రామం నుండి రాఘవపురం గ్రామం వరకు లింక్ బిటి రోడ్డు ఏర్పాటు పనులకు శంకుస్థాపన , చేసిన మంత్రి ఉత్తమ్ రెడ్డి..
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ :
:కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రాధాన్యంతో ఉండదని, బీసీ వర్గాల అభివృద్ధి కార్యక్రమాలను తీర్చి దిద్దేందుకు మద్దతు అందిస్తానని మంత్రి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన సామాజిక న్యాయం, సాంఘిక భిన్నత్వాన్ని, ఇన్క్లూసివ్ వృద్ధిని ఆధారంగా తీసు కుంటుంది…
బీసీ కులగణన వ్యవస్థను తెలంగాణలో మొదటిసారిగా ప్రారంభించి, 3 కోట్ల 70 లక్షల మందిని లెక్కించి, బీసీ జనసంఖ్య 56% అని నిర్దేశించామని చెప్పారు..
కాబట్టి, స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 27% నుండి 42% పెంచడం our మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, ఆ ప్రకారం కొనసాగుతున్నామని చెప్పారు..
బీసీలకు స్థానిక సంస్థలలో, విద్య, ఉద్యోగాలలో సైతం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టపరమైన చర్యలు తీసుకొని ఉన్నామని వివరించారు.ఈ కులగణన చట్టం గవర్నర్ కు పంపబడింది మరియు సంబంధిత జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నియమాలు, ఫండింగ్, అభివృద్ధి పథకాలు తీసుకుంటోందని తెలిపారు
చాకలి ఐలమ్మకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, కోటి వుమెన్స్ యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం, యూనివర్సిటీ పునరుద్ధరణకు పెద్ద స్థాయిలో నిధులు పెట్టడం మా ప్రభుత్వం చేసిన ఘనత అన్నారు.
బూరుగడ్డ గ్రామంలో కుటుంబ పరంగా కూడా అన్నలకు, చెల్లెలు, తమ్ముళ్ల మధ్య ఒక్కటైన సమాజం ఉన్నదని మరింత అభివృద్ధితో కొనసాగుతామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు…
రోడ్లు నాణ్యతతో వేగవంతంగా నిర్మించాలి
రోడ్లు నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు
శుక్రవారం గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో గానుగ బండ నుండి పరెడ్డిగూడెం వరకు 2 కి. మీ దురాన్ని 1.40 కోట్లతో,గానుగ బండ నుండి హనుమంతుల గూడెం వరకు 3.5 కోట్లతో 5 కి. మీ దూరాన్ని నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు అలాగే కల్మలచెరువు గ్రామంలో కల్మలచెరువు నుండి దిర్శించర్ల – చివ్వారిగుడెం వరకు 4.6 కిలోమీటర్ల దూరాన్ని 3.5 కోట్లతో నిర్మించే రోడ్డుకు, కల్మలచెరువు నుండి గానుగబండ వరకు 4 కిలోమీటర్ల దూరాన్ని 2.8 కోట్ల నిర్మించే రోడ్డుకు, కల్మల చెరువు నుండి పాలకీడు సబ్ స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల దూరాన్ని 4.2 కోట్లతో నిర్మించే రోడ్డుకు,కల్మల చెరువు నుండి బోత్తలపాలెం వరకు 5కిలోమీటర్ల దూరం 3.5 కోట్లతో నిర్మించే రోడ్డుకు, సోమ్లాతండా వద్ద కల్మల చెరువు నుండి సోమ్లా తండా వరకు 1.2 కి మీ దూరాన్ని 84 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం దుర్గామాతను దర్శించుకొని మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు పంచాయతీరాజ్ ఈఈ వెంకటయ్య, తహసిల్దార్ కవిత, అధికారులు, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.