కవిత వివాదం అచుతూచి అడుగులు వేస్తున్న… BRS పార్టీ…!

సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవితపై అధిష్ఠానం నిఘా పెట్టింది. ఆమె విషయంలో పార్టీ సీనియర్‌ నేతలు, కేడర్‌ సహా ఎవ్వరూ స్పందించవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అఖరికి ఆమె పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఆమెను పార్టీ బాయ్‌కాట్‌ చేసింది. దానికితోడు కవిత నివాసంతో పాటు, ఆమె ఎక్కడకు వెళ్లినా తనను ఎవరైనా కలుస్తున్నారా? అనేది కూడా పై నుంచి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె గులాబీ నీఘా నీడలో ఉన్నారు. ఆమె ప్రతీ కదలికను ఆమె చుట్టూ మోహరించిన కొందరి ద్వారా పార్టీ పెద్దలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. గత వారం అమెరికా పర్యటన నుంచి వస్తూనే కేసీఆర్‌ చుట్టూ దయ్యాలున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత నుంచి ఆమె ఇంటికే పరిమితం అవుతూ వస్తున్నారు…గురువారం ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్‌, హారీశ్‌రావు, సంతోష్‌ కుమార్‌ సహా అందర్నీ పరోక్షంగా కడిగి పారేశారు. గురువారం చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీని మరింత కుదుపునకు గురి చేశాయి. అలాగే, ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రె్‌సలో చేరి, మంత్రి పదవి కోసం యత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో కవితపై పార్టీ అధిష్ఠానం నిఘాను తీవ్రతరం చేసింది. రాత్రివేళ కూడా ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారన్న విషయాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం మొదట్నించీ పని చేసిన కొందరు సీనియర్స్‌, ఉద్యమకారులతో కవిత నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడుతున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీలయితే పలు అంశాలపై చర్చించేందుకు సమావేశం అవుదామని కవితవారిని కోరుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆమెతో సమావేశమవుతుండగా, మెజార్టీ నేతలు కవితతో భేటీ అయ్యేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ ఆదేశాలమేరకు దూరంగా ఉంటున్నారు..

కేటీఆర్ – కవిత పార్టీలో క్రియాశీలకంగా.. ఇద్దరు అంత సన్నిహితంగా కొనసాగుతున్న సమయంలో ఈ వివాదం ఎక్కడ మొదలైందనే అంశం పైన భిన్న వాదనలు ఉన్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది. కేసీఆర్ పైన గౌరవం చూపిస్తూ నే.. కవిత తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు జరిగాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ నష్టం చేస్తాయనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారు. కేసీఆర్ సైతం ఈ వ్యాఖ్యల పైన ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. కవిత చిట్ చాట్ లో చేసే వ్యాఖ్యల కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉండదనేది మరో వాదన. అయితే, కవిత విషయంలో కేసీఆర్ వేచి చూసే ధోరణితో ఉన్నారు. సమయం చూసి తన నిర్ణయం వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నారు…

పార్టీ పదవుల్లో మార్పులు

కవిత వ్యవహారం పైన కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత – కేటీఆర్ వివాదం పార్టీకి సమస్యగా మారకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీలో ప్రస్తుతం ఉన్న పదవుల్లో కీలక మార్పులు చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమా రం. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగింపు అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటార ది కీలకంగా మారుతోంది. హరీష్ రావుకు ప్రమోషన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కవిత వివాదం వేళ త్వరపడి నిర్ణయాలు తీసుకుంటే.. ప్రతికూల సంకేతాలు వెళ్తాయనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. దీంతో, వచ్చే వారం కేసీఆర్ తన కుమార్తె కవిత వివాదం.. పార్టీలో మార్పుల పైన కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది..