LB నగర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

LB నగర్ లో సర్పంచ్ బోధ సైదిరెడ్డి అధ్యక్షతన గ్రామసభ – ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గరిడేపల్లి (lb నగర్ ),
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని lb నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్ (VB-GRAM-JY) ఆధ్వర్యంలో ఉపాధి, అభివృద్ధి పనులపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ బోధ సైదిరెడ్డి గారు అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ భోద సైదిరెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నిరుపేద కూలీలకు అవసరమైన ఉపాధి హామీ పనుల కల్పనతో పాటు గ్రామ సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామంలో చేపట్టాల్సిన ప్రాధాన్యతా పనులు, మౌలిక వసతుల కల్పనపై పాలకవర్గం, గ్రామస్తులతో సమగ్రంగా చర్చించి పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. Lb నగర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి , ప్రేమలత , TA వనజ ఉపసర్పంచ్ నాగమ్మ , వార్డు సభ్యులు తుంగతుర్తి జానయ్య చారీ ,వెన్న పద్మ , సురగని అరుణ, సూరబీ వెంకటమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి,ANM విజయగారు,అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.