బెంగళూరు ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి..

బెంగళూరు ఘటన(Bengaluru Incident)పై ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు… ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు..గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారికి కేంద్రం రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది..

సన్మాన కార్యక్రమం

కాగా అహ్మదాబాద్లో చారిత్రాత్మక ఐపీఎల్j విజయం తర్వాత ఆర్సిబి జట్టును సత్కరించడానికి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్సిఎ) ఎం చిన్నస్వామి స్టేడియంలో గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది మరణించగాఅనేక మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, సరైన సన్నాహాలు, భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఆరోపించారు..