రెచ్చిపోయిన మోహన్ బాబు.. మీడియా ప్రతినిధులపై దాడి..!!

*మీడియాపై మోహన్ బాబుదాడి!*

TG: మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది.. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలికి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేసి అరాచకం సృష్టించారు. వారి చేతుల్లో ఉన్న మైకులను తీసుకుని నేలకేసి కొట్టారు. అలాగే టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు ఆయనను ఆపేందుకు ప్రయత్నించారు….

మీడియా ప్రతినిధులపై మోహన్ బాబుతో పాటు ఆయన బౌన్సర్లు కూడా దాడి చేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో మారింది.. మోహన్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తాజా పరిణామాలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ను మనోజ్ దంపతులు కలిశారు.

రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను వివరించారు. తనకి భద్రత కల్పించాలని మనోజ్, మౌనిక కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రాచకొండ సిపీ సుధీర్ బాబును కలవాలని వారికి మహేశ్ భగవత్ సూచించారు.