కోతుల బెడద నివారణ కోసం రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం…!

*కోతుల బెడద నివారణ కోసం రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం..

సాధారణంగా అధికారుల వద్ద కానీ, ప్రజా ప్రతినిధుల వద్ద కానీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం తరచూ చూస్తుంటాం…. కానీ..!!

*మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రానికి చెందిన ఈశ్వర్ లింగం అనే వ్యక్తి కోతుల బెడద నివారించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లెటర్ ద్వారా విజ్ఞాపన పత్రాన్ని పంపించారు… రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లెటర్ పై చర్చ జరుగుతోంది.