ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు..

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు
కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. వీరిలో ఆరుగురిపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. వీరు లొంగిపోవడంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్‌ రహిత గ్రామంగా మారినట్లు పోలీసులు వివరించారు. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో పెద్దసంఖ్యలో చనిపోతున్న తరుణంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు…ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ‘నియాద్ నెల్లానార్’ (Niad Nellanar) పథకంలో భాగంగా ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సరెండర్ అయిన వారిలో మొత్తం ఆరుగురిపై రూ.25 లక్షల రివార్డులు ఉన్నాయని.. దీంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్‌ రహిత గ్రామంగా మారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు..