సూర్యాపేట జిల్లా…
మాదిగ అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా నేడు సాధించిన వర్గీకరణ ఫలాలు..
గరిడేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో MRPS మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గరిడేపల్లి జై భీమ్ కమిటీ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రవి మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ* ఆధ్వర్యంలో 30 ఏళ్ళు సుదీర్ఘ అలుపెరగని ఎమ్మార్పీఎస్ ఉద్యమపోరాటం తో ఎంతోమంది మాదిగ అమరులు అసువులు భాషారని, వారి ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు మనం అనుభవిస్తున్న వర్గీకరణ ఫలాలు అని, నేడు మనం విద్యాపరంగా, రాజకీయపరంగా, ప్రతి రంగంలో కూడా ఎస్సీ వర్గీకరణ ఫలాలను, భవిష్యత్ తరాలు కూడా అనుభవిస్తున్నామని, దీనికి కారణం మాదిగ అమరులే అని, ప్రతి సంవత్సరం మార్చి ఒకటి నా మాదిగ అమరుల దినోత్సవంగా జరుపుకోవడం, అసువులు బాసిన అమరులకు ఘన నివాళులర్పించుకోవడం జీవితాంతం ప్రతి మాదిగ జాతి బిడ్డ బాధ్యత అని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్ద పిట్ట పున్నయ్య మాదిగ అమరులకు పూలమాలవేసి, కొబ్బరికాయ కొట్టి, అమరుల ఆత్మ శాంతి కొరకు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి మండల కోఆర్డినేటర్ కుర్రి వెంకన్న మాదిగ, MJF అధ్యక్షులు బరిగల విజయకుమార్ మాదిగ,అప్పన్నపేట గ్రామ ఉపాధ్యక్షులు రామకృష్ణ, గ్రామ అధ్యక్షులు పిట్ట వెంకటేష్, గరిడేపల్లి ఎమ్మార్పీఎస్ సభ్యులు మచ్చ వేణు, మచ్చ సురేష్, బొజ్జ వెంకటేష్, నందిపాటి రవి, పిట్ట నాగరాజు,కొత్తపల్లి పవన్, పిట్ట గోపి, మచ్చఆదాం, పిట్ట రేవంత్, పిట్ట చిట్టిబాబు, ఆలంపల్లి శేఖర్, పిట్టనాగేంద్రబాబు,ఇర్మియ ,సిద్దు, చందాల సైదులు మొదలైన వారు పాల్గొన్నారు.