మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు 40 రోజుల గోటు విలేజ్ కార్యక్రమం..

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజ్యాధికారమే లాక్ష్యంగా 40 రోజుల
గో టు విలేజ్..

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు 40 రోజుల గోటు విలేజ్ కార్యక్రమం లో భాగంగా మండల సమావేశం గరిడేపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ గరిడేపల్లి మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి బచ్చలకూరి ప్రసాద్ మాదిగ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్, గరిడేపల్లి మండల ఇంచార్జ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా వారి పర్యవేక్షణలో సమావేశం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, వర్గీకరణ సాధించామని, సాధించిన వర్గీకరణ ఫలాలను ప్రతి ఒక్కరికి అందాలంటే చదువు చాలా ముఖ్యమైనదని కావున చదువు విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు ఇతర అనుబంధ సంఘాలు ముఖ్యపాత్ర తీసుకుని చదువుని అశ్రద్ధ చేసే వారిని మరియు చదువు మధ్యలో ఆపేసిన వారిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరు స్కూలుకు పోయే విధంగా మోటివేషన్ చేయాలి అని, జాతి ప్రజలు ఆర్థికంగా ఉద్యోగ పరంగా రాజకీయపరంగా అన్ని విధాలుగా ఎదగాలని,అన్ని గ్రామాలలో ఎమ్మార్పీఎస్ కమిటీలు, దిమ్మెలు పూర్తి చేయాలని జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది…పాల్గొన్నవారు కుర్రి వెంకన్న మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కోఆర్డినేటర్, కడప వీరస్వామి మండల ప్రచార కార్యదర్శి, ఆలంపల్లి శేఖర్ మండల ప్రచార కార్యదర్శి, కొత్తపల్లి పవన్ MSF మండల ఉపాధ్యక్షులు, పిట్ట వెంకటేష్ గరిడేపల్లి గ్రామ అధ్యక్షులు, బచ్చలకూరి నాగార్జున,మాచర్ల కనకయ్య, పిట్ట రాజు,మచ్చ వేణు, మచ్చ ఆదాం, మచ్చ గౌతం మొదలైన వారు పాల్గొన్నారు..