ఈనెల 20వ తారీఖున జరిగే మెగా లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి……
అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్.. ఈ నెల 20న జరిగే మెగా లోక్ అదాలత్ కు సంబంధించి హుజూర్నగర్ న్యాయవాదులతో బార్ అసోసియేషన్ హాల్లో బార అసోసియేషన్ ఉపాధ్యక్షులు జక్కుల వీరయ్య అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని, న్యాయవాదులందరూ జిల్లాలోనే ఎక్కువ మొత్తంలో కేసులు హుజూర్నగర్ నుండి రాజు అయ్యేవిధంగా సహకరించాలని, కేసు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారని అదే రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని సమయము మరియు డబ్బు ఆదా అవుతుందని కక్షి దారులకు నచ్చ జెప్పి రాజీచేయాలని కోరారు. సీనియర్ సివిల్ జడ్జ్ శ్యాంసుందర్ మాట్లాడుతూ న్యాయవాదులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోని ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ చేసే విధంగా ప్రయత్నం చేయాలని వారు కోరారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయేషా శరీన్ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన అన్ని రకాల కేసులను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నట్టే సత్యనారాయణ, కుక్కడపు బాలకృష్ణ, కుక్కడపు సైదులు, ఏ జి పి బానోత్ సురేష్ నాయక్, నగేష్ రాథోడ్ , క్రీడల కార్యదర్శి అడవి రాముడు, మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలాబి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బుడిగ నరేష్, నాగూర్ భాష, సైదా హుస్సేన్, సుందర్ రాఘవరావు, మీసాల అంజయ్య, శ్రీను నాయక్, శంకర్, మోహన్,, వీరు, బ్రహ్మచారి, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు..