మతాల జనాభాకు సంబంధించి ప్యూ రీసెర్చి సెంటర్ జరిపిన అధ్యయనంలో వేగంగా పెరుగుతున్న మతంగా ఇస్లాం నిలిచింది. తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోందట…క్రైస్తవుల సంఖ్య తగ్గుతోందని, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్యభాగం నాటికి క్రైస్తవంతో ఇస్లాం సమానం కానుందని ఈ లెక్కలు చెబుతున్నాయి.


హిందువుల జనాభా స్థిరంగా ఉండగా, బౌద్ధుల సంఖ్య తగ్గుతోంది. 2010-2020 కాలంలో క్రైస్తవుల జనాభా 218 కోట్ల నుంచి 230 కోట్లకు పెరిగింది. ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా 2010లో 30.6 శాతం ఉండగా, అది 2020నాటికి 28.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా మాత్రం 34.70 కోట్ల మేర పెరిగింది. ఏ మతమూ లేదని చెప్పే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 24.2 శాతం వరకు ఉంది. ఐరోపా దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతోంది. ఎలాంటి మతం లేదని చెప్పేవారి సంఖ్య అమెరికా, చైనా, జపాన్ల్లో అధికంగా ఉంది…
క్రైస్తవం వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రపంచ జనాభాలో వీరి సంఖ్య తగ్గుతున్నది. 2010 నుంచి -2020 మధ్య వీరు 12.2 కోట్ల మంది పెరిగారు. 230 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతి పెద్ద మతంగా క్రైస్తవం కొనసాగుతున్నది. ఏ మతంతోనూ సంబంధంలేనివారు ప్రపంచ జనాభాలో 24.2 శాతం ఉన్నారు. ప్రపంచ జనాభాలో 14.9 శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉన్నారు. మధ్య ప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి వీరు వలస వెళ్లడంతో అక్కడ వీరి జనాభా 2010-, 2020 మధ్య 62 శాతం పెరిగింది…
హిందూ మతం స్థిరమైన వృద్ధి: హిందూ జనాభా దాదాపు ప్రపంచ జనాభా వృద్ధి రేటుతోనే పెరిగింది. 2010 నుంచి 2020 వరకు 126 మిలియన్లు పెరిగి, 120కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో హిందువుల శాతం 14.9శాతం దగ్గర స్థిరంగా ఉంది.
క్రైస్తవ మతం తగ్గింది: క్రైస్తవ మతం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం అయినప్పటికీ 230కోట్ల జనాభా కలిగి ఉంది. అయినా దాని వాటా తగ్గింది. మత మార్పిడులు ,జనన రేట్లు తక్కువగా ఉండటం వల్ల 2010 నుంచి 2020 వరకు 1.8 శాతం తగ్గింది.
మతపరంగా సంబంధం లేనివారు : మతపరంగా సంబంధం లేని వ్యక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ప్రపంచ జనాభాలో మూడవ అతిపెద్ద సమూహంగా ఉంది. ఈ రిపోర్టులు ప్రపంచంలో మతపరమైన కూర్పులో జరుగుతున్న ముఖ్యమైన మార్పులను హైలైట్ చేస్తున్నాయి..