వచ్చే ఎన్నికల్లో తాను ఇక పోటీచేయను… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!?

వచ్చే ఎన్నికల్లో తాను ఇక పోటీచేయబోనని, ఇదే తన ఆఖరి టర్మ్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పుడు తనకు 62 ఏండ్ల వయసని, ఇక రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోనని చెప్పారు. ఇప్పటివరకు తాను ఏడు పర్యాయలు వరుసగా చట్టసభలకు ఎన్నికవుతూ వచ్చానని గుర్తుచేశారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్‌ఏ అధికారులతో భేటీ అయ్యారు..

ప్రస్తుతం ఈ వార్త ఓ ప్రధాన పత్రికలో ప్రచురించబడింది ఇది ఏ మాత్రం నిజమనేది మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందిస్తేనే తెలుస్తుంది..