🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 11 – 02 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చతుర్దశి* రా7.00 వరకు,
నక్షత్రం : *పుష్యమి* సా6.55 వరకు,
యోగం : *ఆయుష్మాన్* ఉ9.44 వరకు,
కరణం : *గరజి* ఉ7.11 వరకు,
తదుపరి *వణిజ* రా7.00 వరకు,
వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తము : *ఉ8.50 – 9.35,*
మరల *రా10.58 – 11.49,*
అమృతకాలం : *మ12.28 – 2.04,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.34,
సూర్యాస్తమయం: 5.55,
*_నేటి మాట_*
*ఆ దివ్య శక్తిని ఎలా దర్శించాలి ???*
దివ్యశక్తి ని దర్శించాలంటే స్థిరమైన భక్తి ఉండాలి!!…
పూవు లోని పరిమళములు, గ్రుడ్డులోని పిట్ట, చెఱకులోని తీపి, మిరప లోని కారము, వేప లోని చేదు… ఇవన్నీ ఎక్కడనుండి ప్రారంభ మయ్యాయి?
వీటిని అర్థం చేసుకోవడానికే మానవునికి సాధ్యం కావట్లేదు.
కానీ ఇవన్నీ దైవసృష్టి లోని విచిత్ర ములే!
మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది, అది తెలుసుకోవాలి…
ఎత్తైన పర్వతాలు, నదీ ప్రవాహాలు, ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది! ఇవన్నీ దైవము యొక్క పరమాద్భుత మైన సౌందర్యము నకు ప్రతీకలు.
దైవము యొక్క సౌందర్యము ను వర్ణింప ఎవరికీ సాధ్యము కాదు.
అలాగే దైవము యొక్క శక్తి సామర్థ్యము లను గుర్తింప వీలుకాదు.
అల్ప బుద్ధి గలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏరీతిగా అర్ధము చేసుకోగలరు? దైవత్వము ను పొందాలంటే, తగిన అర్హతను మీరు పొందాలి.
ఉపనిషత్తుల సారమిదే. రాముడా, కృష్ణుడా, ?గోవిందుడా? నారాయణుడా? అసలు ఆ దివ్య శక్తి కి రూపమే లేదు.
అందులో పరిపూర్ణ మైన జ్ఞానము, ఆనందము తప్ప అన్యములేదు.
_స్థిరమైన భక్తి, నిర్మల త్వము, నిస్వార్థ మును సాధించాలి అప్పుడే దివ్య శక్తి గోచర మౌతుంది_.
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏