🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 05 – 04 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* రా12.31 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* ఉ10.27 వరకు,
యోగం : *అతిగండ* రా12.42 వరకు,
కరణం : *భద్ర* మ1.09 వరకు,
తదుపరి *బవ* రా12.31 వరకు,
వర్జ్యం : *రా10.14 – 11.48,*
దుర్ముహూర్తము : *ఉ5.56 – 7.33,*
అమృతకాలం : *లేదు,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.56,
సూర్యాస్తమయం: 6.10,
*_నేటి విశేషం_*
*చైత్ర శుద్ధ అష్టమి – అశోకాష్టమి*
చైత్ర శుద్ధ అష్టమి నాటి వివరణలో మన పంచాంగకర్తలు భవానీ యాత్ర, అశోకాష్టమి, అశోక రుద్రపూజ, అశోకకలికా ప్రాశనం అనే వ్రతాలు ఆచరించాలని శాస్త్రంలో చెప్పబడింది.
దీనిని బట్టి ఇది భవానీ అష్టమిగా, అశోకాష్టమిగా పరిగణింపబడుతూ ఉందని తెలుస్తోంది.
భవానీ అనేది పార్వతీదేవికి గల మరో పేరు.
ఆమె శివుని భార్య, శివుని మొదటి భార్య సతీదేవి, ఆమె దక్షుని పెద్ద కుమార్తె…
శివుడు ఒకసారి దక్షుని నిరాదరించాడు.
ఆ కోపాన దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు.
ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ పుట్టింటికి పిలుస్తూ చీరలు, సారెలు పెట్టి పంపించే వాడు.
ఈ క్రమంలోనే దక్షుడు ఒకసారి మహా క్రతువు తలపెట్టాడు, దీనిని పార్వతిని తప్ప అందరినీ పిలిచాడు.
కానీ పార్వతి పుట్టింటిపై మమకారంతో వెళ్లింది.
అక్కడ ఆమెను తండ్రితో సహా ఎవరూ పలకరించలేదు.
ఈ అవమానం భరించలేక కాలి బొటనవేలితో నేలరాచింది.
యోగాగ్ని పుట్టింది, అందులో ఆమె భస్మమైపోయింది, సతీదేవి భస్మమైన విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు.
యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భంలో చైత్ర శుద్ధ అష్టమి నాడు పుట్టింది.
పర్వతరాజుకు పుట్టడం చేత ఆమెను పార్వతి అని పిలవసాగారు.
భవానీ ఆమె పర్యాయ పదం.
అష్టమి తిథిని పురస్కరించుకుని ప్రతిఒక్కరూ దుర్గా సప్త శ్లోకీ పఠించడం మంచిది…
చైత్ర శుద్ధ అష్టమి భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు.
ఆరోజు భవాని మాతని పూజిస్తారు.
స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.
దక్షయజ్ఞములో దేహాన్ని విడిచిన సతీదేవి మేనా హిమవంతులకు పార్వతిగా అవతరించిన రోజు.
ఈ రోజున శివ-పార్వతులను అర్చించడం, కల్యాణం చేయడం వలన శివ-పార్వతుల అనుగ్రహం లభించి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది.
అశోక వృక్షమును పూజించి, ఆ చెట్టుయొక్క ఎనిమిది మొగ్గలను ప్రసాదంగా స్వీకరించడమనే విధానం కూడా శాస్త్రంలో చెప్పబడింది.
*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏