🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 03 – 06 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* రా12.44 వరకు,
నక్షత్రం : *పుబ్బ* తె3.52 వరకు,
యోగం : *హర్షణం* ఉ11.38 వరకు,
కరణం : *భద్ర* మ12.29 వరకు,
తదుపరి *బవ* రా12.44 వరకు,
వర్జ్యం : *ఉ11.02 – 12.43,*
దుర్ముహూర్తము : *ఉ8.03 – 8.55,*
మరల *రా10.51 – 11.35,*
అమృతకాలం : *రా9.08 – 10.49,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం: 6.27,
*_నేటి విశేషం_*
*మంగళాష్టమి*
మంగళవారం అష్టమి తిథి రావడం చాలా అరుదు…
మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం వుంటుంది,
*కానీ ‘అష్టమి వ్యాధి నాశినీ’ అనేది ప్రసిద్ధ వాక్యం*…
అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించినా, ఔషధాన్ని సేవించినా సత్వరం శుభఫలితం కలుగుతుందని ‘చరక సంహిత’ చెబుతోంది.
మరి అష్టమినాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం.
నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం, అవే అష్ట భార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి.
అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది అంటారు.
ఎందరు రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా, వారంతా హరీ అన్నారు.
ఒక్క అష్టమి అనే కాదు, ప్రతీ తిథీ మంచిదే.
అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపింది,మనం అర్థం చేసుకుని ఆచరించాల్సిందీ ఇదే.
*కష్టాలను తొలగించే అష్టమి*
శివ పురాణం ప్రకారం, అష్టమి రోజు కాలభైరవుడిని ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి.
“అత్యంత క్రూరమైన మహాకాయ కల్పాంత దహనోపం, భైరవ నమస్తుభ్యం అనుమతి దాతుమర్హసి||”
*”ఓం భయహరణం చ భైరవః “*
*”ఓం కాలభైరవాయ నమః”*
*”ఓం హ్రీం బాం బతుకాయ్ ఆపదుద్ధరణయ్ కురుకురు బతుకాయ్ హ్రీమ్”*
ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవుని విగ్రహం లేదా పఠం ఎదుట దీపం వెలిగించాలి.
*_🌷శుభమస్తు 🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏