నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪴పంచాంగం🪴
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ …19 – 06 – 2025,
వారం …బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,

తిథి : *అష్టమి* ఉ8.44 వరకు,
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా8.42 వరకు,
యోగం : *సౌభాగ్యం* రా12.49 వరకు,
కరణం : *కౌలువ* ఉ8.44 వరకు,
తదుపరి *తైతుల* రా7.39 వరకు,

వర్జ్యం : *ఉ7.03 – 8.34*
దుర్ముహూర్తము : *ఉ9.50 – 10.42,*
మరల *మ3.03 – 3.55,*
అమృతకాలం : *సా4.09 – 5.40,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 5.30,
సూర్యాస్తమయం: 6.32,

*_నేటి మాట_*

*జీవితంలో నిత్య సత్యమైనాదానిని విశ్వసించాలి!!*

నిత్య జీవితంలో సత్యమైనది, మార్పు లేనిది, ఒక్క దైవం మాత్రమే, ఆ దైవాన్ని విశ్వసించాలి మనం!!…

పరిపూర్ణ మైన జీవితాన్ని గడపాలి అంటే, ముందు ఆయన గురించి అన్వేషించాలి,
మానవత్వం లో ఎంతో విచిత్రమైన శక్తి ఉన్నది,
భగవంతుని సృష్టి యే మహా విచిత్రమైనది.

ఒక మానవుని వలె మరొక మానవుడు లేడు.
ఒక వేలి ముద్ర వలె మరొక వేలి ముద్ర లేదు.
అంతా విచిత్రంగా ఉంటున్నది…
భగవంతుని సృష్టి ఒక మౌల్డ్ తో చేసేదికాదు, లేక ఒక రబ్బరు స్టాంపు తో చేసేదికాదు.

ఇది క్షణ క్షణంమునకూ మారేటి వంటిది.
విభిన్న మైన రూపనామములను ధరించేటటువంటిది,
కవలపిల్లలయందు కూడా, ఏదో వ్యత్యాసం ఉండే తీరుతుంది.
ఇంత విచిత్రమైనది భగవత్ సృష్టి.

మన హృదయంలో భగవంతుడు తప్ప మరొకడు ఉండకూడదు,
భార్యా భర్తల మధ్య, తల్లీ పిల్లల మధ్య, అన్న దమ్ములమధ్య ఉండేది దేహ సంబంధమే కానీ హృదయసంబంధముకాదు.

ఈసంబంధాలన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే!
నీవు పుట్టక ముందు, పుట్టిన తరువాత మరణించిన తరువాత కూడా నీ వెంట దేవుడే ఉంటున్నాడు.
ఇతడుసర్వవ్యాపి , ఆయన లేని స్థలం ఉండదు.
కనుక ఇట్టి నిత్య సత్యమైన దైవాన్ని విశ్వసించాలి, అప్పుడే మానవ జీవితానికి ఒక సార్థకం చేకూరుతుంది.

*_🪴శుభమస్తు🪴_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏