ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి..!

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఓ తెలంగాణ వాసి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మృతి చెందిన వ్యక్తిని జగిత్యాల జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ విషాద వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు…ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం రవీందర్ ఇజ్రాయెల్ కి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య భీకర దాడులు నేపధ్యంలో బాంబుల శబ్దం వల్ల రవీందర్‌ గుండెపోటుతో మృతి చెందాడని వాపోతున్నారు. మరోవైపు ఇరుదేశాల మధ్య యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దాంతో రవీందర్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని అతడి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు…

మరో తెలంగాణవాసి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వాడిని ప్రత్యక్షంగా మాట్లాడుతూ వీడియోలు సోషల్ మీడియాలో సెండ్ చేయడం జరిగింది..

ఇజ్రాయెల్ : నుండి తెలంగాణా వాసి ప్రత్యక్షంగా
ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం గురించి వివరిస్తున్నాడు….
బంకర్ లోనికి వెళితేనే సేఫ్…జూన్ 31 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు…అప్పటి వరకు తప్పదు…అంటున్న
ఇజ్రాయేల్ లో పనిచేస్తున్న తెలంగాణ వాసులు……