నేటి పంచాంగం..నేటి విశేషం…

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం..
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 08 – 08 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *చతుర్దశి* మ1.44 వరకు,
నక్షత్రం : *ఉత్తరాషాఢ* మ3.05 వరకు,
యోగం : *ప్రీతి* ఉ7.06 వరకు,
కరణం : *వణిజ* మ1.44 వరకు,
తదుపరి *భద్ర* రా1.38 వరకు,

వర్జ్యం : *రా7.09 – 8.47*
దుర్ముహూర్తము : *ఉ8.16 – 9.07,*
మరల *మ12.31 – 1.22,*
అమృతకాలం : *ఉ8.25 – 10.05*
మరల *తె4.56 నుండి,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 5.44,
సూర్యాస్తమయం: 6.28,

*_నేటి విశేషం_*

_*వరలక్ష్మీ వ్రతము – వ్రత సంకల్పం – పూజా విధానం*_

పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ).

అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము

పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార

తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.

పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.

పూజావిధానం:
ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమోనమః

ఓం
దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి |
సానో మంద్రేష మూర్జా దుహనాధేనుః వాగస్మానుపసుష్టు తైతు ||
అయంముహూర్త సుముహూర్తోస్తు

సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!

దీపము వెలిగించాలి.

ఆచమ్య:

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా,ఓం గోవిందాయ నమః,ఓం విష్ణవే నమః,ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,ఓం వామనాయ నమః,ఓం శ్రీధరాయ నమః,ఓం హృషీకేశాయ నమః,ఓం పద్మనాభాయ నమః,ఓం దామోదరాయనమః,ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః,ఓం ప్రద్యుమ్నాయ నమః,ఓం అనిరుద్ధాయ నమః,ఓం  పురుషోత్తమాయ నమః,ఓం అధోక్షజాయ నమః,ఓం నారసింహాయ నమః,ఓం అచ్యుతాయ నమః,ఓం జనార్దనాయ నమః,ఓం ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)
శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!

(ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి) ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్
మమ ఉపాత్త సమస్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ……… ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్య ప్రదేశే…స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన …….సంవత్సరే ….ఆయనే…..ఋతౌ…మాసే…..పక్షే….తిథౌ…..వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః….అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షేవర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతాప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పక్త ప్రకారేణ యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యంర్ధం
శ్రీ మహగణధిపతి దేవతా పూజాం కరిష్యే ! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!

అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.

శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!
అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!
ఓం
ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే ; ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాడాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!
కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!

దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య!!

(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)

ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతేస్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |

మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి| హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |

మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి| హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః | శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః| అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |

మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.

ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపం

వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.

దీపం

సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె 
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి |

నైవేద్యం:

ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్  సత్యన్త్వర్తేన పరిషించామి| అమృతమస్తు అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి  అమ్రుతాపితానమసి  వుత్తరాపోషణం సమర్పయామి  హస్తౌ ప్రక్షాళయామి  పాదౌ ప్రక్షాళయామి  ముఖేశుద్దాచమనీయం సమర్పయామి 

తాంబూలం

ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి మాధవ్యోసనీతి ఏకధా బ్రహ్మణ ముపహరతి ఏకదైవ ఆయుష్తేజో దదాతి
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||

మంత్రపుష్పం

శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః  ధూమకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః  షోడశైతాని నామాని యఃపఠే చ్రుణుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమో నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షణ

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే  పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||

యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తాన్యాతి సద్యోవందే గణాధిపం  మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే  అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు  శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి.

గణపతి వద్దనున్న పుష్పము,అక్షతలు శిరస్సున ధరించవలెను.

గణపతి ఆకుని తూర్పవైపుకు జరపవలేను

మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మానణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే క్షేమాయ పునరాగమనాయచ.

అధ శ్రీ మహగణపతిపూజాం సంపూర్ణం
🙏🙏🙏

అధ శ్రీ వరలక్ష్మీ దేవతావ్రత పూజ ప్రారంభం

కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!
యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!

(అని ప్రార్థించి దేవునిపై పుష్పము నుంచవలెను)

అథ ధ్యానమ్:

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!

ధ్యానం
లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!

ఆవాహనం:

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!
ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, ఆవాహయామి!

ఆసనమ్:

సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!
సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.

అర్ఘ్యమ్:

శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!

పాద్యమ్:

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, పాదయోః పాద్యం సమర్పయామి!

ఆచమనీయం:

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, ముఖే ఆచమనీయం సమర్పయామి

పంచామృత స్నానం:

పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి

శుద్ధోదక స్నానం:

గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!
శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రం:

సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, వస్త్రయుగ్మం సమర్పయామి

ఆభరణం:

కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, ఆభరణాని సమర్పయామి

యజ్ఞోపవీతం:

తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:

కర్పూరాగరు కస్తూరీ గోరోచనాదిభిరన్వితమ్!
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, గంధం విలేపయామి

అక్షతలు:

అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!
హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి

పుష్పం:

మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి

అథాంగపూజా!
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః జానునీ పూజయామి
ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి
ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి
ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి
ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి
ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః శిరః పూజయామి
ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే
అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.

శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)

ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం శ్రీ భువనేశ్వర్యై నమః (108)

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
🙏🙏🙏

ధూపం

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, ధూపమాఘ్రాపయామి

అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను

ఘృతవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి

(దీపము చూపవలెను)

నైవేద్యం

శుద్ధాచమనీయం సమర్పయామి

ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్  సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు అమృతోపస్త్హరణమసి ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః
నానావిధ  భక్ష్య భోజ్య సహిత నారికేళ ఫల సహిత కదలిఫలం నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి  అమ్రుతాపితానమసి  వుత్తరాపోషణం సమర్పయామి  హస్తౌ ప్రక్షాళయామి  పాదౌ ప్రక్షాళయామి  శుద్దాచమనీయం సమర్పయామి 

నీరువదలిపెట్టవలెను

నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి

నివేదనము చేసి నీటిని వదలవలెను.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి

నీరాజనం

నీరాజనం మయానీతం కర్పూరేణ సమన్వితమ్!
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి

నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి

మంత్రపుష్పం

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!

ఓం రా॒జా॒ధి॒రా॒జాయ॑ ప్రసహ్య సా॒హినే᳚ । నమో॑ వ॒యం-వైఀ᳚శ్రవ॒ణాయ॑ కుర్మహే । స మే॒ కామా॒న్ కామ॒ కామా॑య॒ మహ్యం᳚ । కా॒మే॒శ్వ॒రో వై᳚శ్రవ॒ణో ద॑దాతు । కు॒బే॒రాయ॑ వైశ్రవ॒ణాయ॑ । మ॒హా॒రాజాయ॒ నమః॑ ।
ఓం᳚ తద్బ్ర॒హ్మ । ఓం᳚ తద్వా॒యుః । ఓం᳚ తదా॒త్మా ।
ఓం᳚ తథ్స॒త్యమ్ । ఓం᳚ తత్సర్వం᳚ । ఓం᳚ తత్పురో॒ర్నమః ॥
అంతశ్చరతి॑ భూతే॒షు గుహాయాం-విఀ ॑శ్వమూ॒ర్తిషు ।
త్వం-యజ్ఞస్త్వం-వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం-విష్ణుస్త్వం బ్రహ్మత్వం॑ ప్రజా॒పతిః ।
త్వం త॑దాప॒ ఆపో॒ జ్యోతీ॒రసో॒ఽమృతం బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ।
ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం  
శుద్ధలక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీ వరలక్ష్మీచ ప్రసన్న మమ సర్వదా
వరాంకుశౌ పాశమ భీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థామ్ బాలార్క కోటిప్రతిభాం
త్రినేత్రాం భజేஉహమంబాం జగధీశ్వరీం త్వామ్

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోஉస్తుతే II

ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వర స్సర్వ భూతానాం ! బ్రహ్మధిపతి ర్బ్రహ్మణొ దిపతిర్బ్రహ్మ శివోమే స్తు సదాశివొమ్ !

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,పాదరవిందయోః సువర్ణదివ్య మంత్రపుష్పాణి సమర్పయామి.

పుష్పము అక్షతలు ఉంచవలెను

ప్రదక్షిణం

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి

నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమోనమః, నమస్కారాన్ సమర్పయామి

తోరగ్రంథి పూజా!

ఓం కమలాయై నమః – ప్రథమ గ్రంథిం పూజయామి
రమాయై నమః – ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రే నమః – తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యై నమః – చతుర్థ గ్రంథిం పూజయామి
వరలక్ష్మీ నమః – పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ధి తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమ గ్రంథిం పూజయామి
చంద్ర సహోదర్యై నమః – అష్టమగ్రంథిం పూజయామి
హరివల్లభాయై నమః – నవమ గ్రంథిం పూజయామి

ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.

శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే !

వాయన దానము:

శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!

శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు: న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే,
అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయాచభగవతి సర్వదేవాత్మికాచ శ్రీ వరలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు. మమ ఇష్టకామ్యార్ధ ఫల సిద్ధిరస్తు. 🙏🙏🙏

అక్షతలు తీసుకుని నీరువదలవలెను.

వరలక్ష్మీ వ్రత కథ

సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జ