నేటి పంచాంగం..నేటి మాట..!

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 10 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
బహుళ పక్షం,

తిథి : *నవమి* మ2.40 వరకు,
నక్షత్రం : *పుష్యమి* సా4.47 వరకు,
యోగం : *సిద్ధం* ఉ9.49 వరకు,
కరణం : *గరజి* మ2.40 వరకు,
తదుపరి *వణిజ* రా2.10 వరకు,

వర్జ్యం : *తె5.27నుండి*
దుర్ముహూర్తము : *ఉ11.23 – 12.09*
అమృతకాలం : *ఉ10.34 – 12.07*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండం : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం : *5.56*
సూర్యాస్తమయం : *5.37*

*_నేటి మాట_*

*వేద వైదిక ధర్మం అనగానేమి??*
వైదిక ధర్మమార్గ పరతాః…!!
మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం.. ఇవి లభించటం నిజంగా వరమే. అయితే ఈ లక్షణాలతో ముందుకు పోయినప్పుడే గదా ప్రయోజనం…
నా దగ్గర సరైన మందు ఉందిగదా అని కూర్చుంటే రోగం తగ్గిపోతుందా, ఆ మందు సేవిస్తేనే గదా ఉపయెగం!!…

అలాగే పై లక్షణాలు గలవాడు ముందుకు పోవాలంటే ఏమిటి మార్గం..?? వేదాలు చూపిన ధర్మమైన మార్గంలో ముందుకు నడవాలనే నిష్ఠ ఉండాలంటున్నారు!!.

మన బుద్ధిని ఏకాగ్రం చేసుకొనుటకు వేదాలు కొన్ని మార్గాలు మనకు చూపుతాయి.

అవె!!…
నిస్వార్థ కర్మాచరణ,
మానసిక పూజ,
జపం,
తపం (ధ్యానం),
శ్రవణ,
మనన,
నిధిధ్యాసన
… మొదలైన సాధనలు, ఇవి సక్రమంగా ఆచరించినప్పుడు మన అంతరంగం పరిశుద్ధమౌతుంది.
మనస్సు శాంతించి ధ్యానానుకూలమవుతుంది, భగవంతుని పట్ల ఏకాగ్రత కుదురుతుంది.

కనుక.. “సత్త్వగుణ ప్రధానులై వేదాంత శాస్త్రాలను శ్రవణం చేస్తూ అవి చూపే మార్గాన ప్రయాణం చేయాలి”.. అట్టి మనోబుద్ధులు కలిగి ఉండటమే గొప్ప అదృష్టం.

వేద విరుద్ధ మార్గాల వైపుకు ఆకర్షించబడితే ఈ లభించిన జన్మ కూడా వృధాయే. వేదాలను, వేదాంతాన్ని, భగవద్గీతను ఎగతాళి చేసే వారితో చేరకూడదు…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏