Neti panchangam.. నేటి పంచాంగం..నేటి విశేషం..

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 23 – 11 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *తదియ* సా4.32 వరకు
నక్షత్రం : *మూల* సా5.44 వరకు
యోగం : *ధృతి* ఉ11.34 వరకు
కరణం : *గరజి* సా4.32 వరకు
తదుపరి *వణిజ* తె5.13 వరకు,

వర్జ్యం : *మ3.59 – 5.44*
మరల *తె4.04 – 5.48*
దుర్ముహూర్తము : *మ3.50 – 4.35*
అమృతకాలం : *ఉ10.45 – 12.30*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండం : *మ12.00 – 1.30*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.12*
సూర్యాస్తమయం : *5.20*

*_నేటి విశేషం_*

*భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష ( 100 ) జన్మదినోత్సవం*
గొల్లపల్లి అనే చిన్న గ్రామంలో, పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మల గర్భంలో జన్మించిన అవతార పురుషుడే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు…
సత్య స్వరూపులు మరియు ప్రేమ స్వరూపుడు శ్రీ బాబా వారు…
లోక సేవ జన సేవ ఆచరించి, ఆచరింప చేసిన మహానుభావుడు, మానవ సేవయే మాధవ సేవ అని చాటిచెప్పి దానిని పాటింప చేశారు…

*ఇంతకీ ఈ సత్య సాయిబాబా వారు ఎవరు?*
బారద్వాజ మహర్షి వారు శివుణ్ణి, తన యజ్ఞంలో అధిష్టాన దేవతగా ఆహ్వానించడం కోసం ఆహ్వానించాడానికి, కయిలాసం వెళ్ళినప్పుడు, శివ పార్వతులు, ఇతనిని చూడకుండా 3 రోజులు గడిపారు, ఋషి వారు ఆ హిమ మహిమ వల్ల ఒళ్ళంతా చచ్చుబడి క్రింద పడిపోయాడు,
ఆ శబ్దానికి శివుడి ధ్యానం భంగమై, అప్పుడు కళ్ళు తెరిసి చూసినప్పుడు, ముందర భరద్వాజ మహర్షి అగుపిస్తారు,
అప్పుడు శివపార్వతులు దయా కృపకు పాత్రులు అవుతారు,
*నువ్వు మా దర్శనం కోసం 3రోజులు నిరీక్షించినందులకు, 3 వరాలు కొరకొమ్మని అనుగ్రహిస్తారు …*
స్వామి నా గోత్రంలో మీరు జన్మించి, మా గోత్రాభివృద్ధిని గావించాలి, అని ప్రార్ధిస్తారు …
అప్పుడు … 3 రోజులు నిరీక్షించినందులకు 3 సార్లు మేము మీ గోత్రం లో జన్మించి, మీ గోత్రాభివృద్ధి చెందిస్తామని వరమిస్తారు…
ఒకసారి – శివుడిగా ,
ఇంకొకసారి – శివ శక్తిగా,
మరొకసారి – శక్తిగా,
1, శిరిడీ సాయి బాబా వారు,
2, సత్యసాయి బాబా వారు,
3, ప్రేమసాయి బాబా వారు,

బాబా వారు సాక్షాత్తు సత్య, ప్రేమ, జ్ఞాన స్వరూపుడు…
సేవా సంకల్పిత మాత్రుడు, వారు సంకల్పిస్తే అసాధ్యమైనది ఏమి లేదు, నిరుపేదల కోసం హాస్పిటల్స్ స్థాపించి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు,
సత్యసాయి సేవా సంస్థలు స్థాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ధర్మ కార్యములు,ఉచిత సేవలు, అందిస్తున్నారు,
బాబా వారు లేనప్పటికీ, తన సంకల్పముల చేత , ఇప్పటికీ నిత్య నూతనంగా , పేద పిల్లలకు, కాలేజీలు, ఉచిత విద్య, వైద్య సేవలు కొనసాగుతూనే ఉన్నాయి,
ఎంతోమంది స్వామి వారి అనుగ్రహముతో చదువుకున్న పిల్లలు, వారు ప్రత్యేక ట్రస్ట్ లు స్థాపించి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు,..

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, ఆత్మజ్ఞానం గూర్చి ఎన్నో ప్రసంగాల రూపకంగా తెలిపారు,
మనిషి – మాధవునిగా మారడానికి ఎన్నో విధములైన ఆత్మ జ్ఞానం భోదించి తరింప చేశారు…
భక్తులకి ప్రేమను పంచారు, ప్రేమను నింపారు, సమాజ సేవ చేయమని భక్తులకి చెప్పారు, తాను చేసి తన భక్తులకు నేర్పించి, తరింప చేశారు…
స్వామి వారు సనాతన ధర్మం గూర్చి ఎంతో చెప్పారు,
స్వామి ద్వారా వేరే దేశాల భక్తులు భారత దేశానికి వచ్చి భారత దేశం ఆధ్యాత్మిక శక్తి నీ గ్రహించి, ఇక్కడే స్థిరపడినవారు ఎంతోమంది వున్నారు…
వారు భగవాన్ బాబా వాటి నిలయంలో సేవ చేస్తున్నారు…
సత్యము ప్రేమ ఉన్నచోట సత్యసాయి వుంటారు,
భక్తులు ఉన్నచోట బాబా వుంటారు.
*సత్య ప్రేమల మేటి కలయికే విశ్వమూల చక్రవర్తి శ్రీ సత్యసాయి బాబావారు.*
శాంతి ఆనందం ప్రేమ ఉన్న చోట సాయి స్థిరనివాసముండును, కాలమే ఆకారమై సర్వసాక్షి గా ఉన్నవారు శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు.

*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏