🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 12 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిథి : *త్రయోదశి* సా6.17 వరకు,
నక్షత్రం : *భరణి* ఉ6.49 వరకు,
తదుపరి *కృత్తిక* తె5.28 వరకు,
యోగం : *శివం* ఉ11.40 వరకు,
కరణం : *కౌలువ* ఉ7.22 వరకు,
తదుపరి *తైతుల* సా6.17 వరకు,
ఆ తదుపరి *గరజి* తె5.18 వరకు,
వర్జ్యం : *సా6.08 – 7.39*
దుర్ముహూర్తము : *ఉ8.36 – 9.20*
మరల *మ12.16 – 1.00*
అమృతకాలం : *తె3.12 – 4.42*
రాహుకాలం : *ఉ10.30 – 12.00*
యమగండం : *మ3.00 – 4.30*
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.25,
సూర్యాస్తమయం: 5.24,
*_నేటి విశేషం_*
*హనుమద్ వ్రతం / హనుమద్వ్రతం*
మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా – మహావీరేణ ధీమతా ||
మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు.
పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు, ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం.
హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి.
ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.
*పంపాకలశ ప్రతిష్ఠ*
ఆచమ్య, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ
శ్రీసువర్చలా సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పంపాపూజాం కరిష్యే అని నీటిని తాకాలి.
ముందుగా పంపాకలశ ప్రరిష్టాపన చేసి షోడశోపచారాలతో పంపాపూజ చేయాలి.
పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దానిముందు ఐదు తమలపాకులు ఒకేరీతిగా పరిచి దానిపై వెండి, రాగి, లేదా కంచు పాత్ర ఉంచాలి.
‘ఇమం మే వరుణ’ మంత్రంతో ఆ పాత్రను నీళ్ళతో (పంపానదీ నీళ్ళతో) నింపాలి.
“ఇమం మే గంగా” అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్ళను అభిమంత్రించాలి.
తరువాత ఆ పంపాకలశంలో సువర్ణమౌక్తికలు ఉంచి గంధపుష్పాక్షతాలను, అష్టగంధ, కర్పూరాలు ఉంచి
‘ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవతా కలశాయ నమః
అని ఆ కలశానికి నమస్కరించి నూతనవస్త్రం చుట్టి కలశానికి ‘బృహత్సామ’ మంత్రంతో రక్షాబంధనం చేయాలి.
పుష్పాక్షతలు తీసుకుని – ఐ౦ హ్రీం శ్రీం ఓం నమోభగవాతే అశేష తీర్థాలవాలే శివజటాదిరూఢే గంగే గంగాంబికే స్వాహా||
సర్వానందకరీ మశేషదురితధ్వంసీం మృగాంకప్రభాం
త్య్రక్షమూర్ద్వ కరద్వయేన దధతీం పాశం సృణీం చ క్రమాత్
దోర్భ్యాంచామృత పూర్ణకుంభ మవరే ముక్తాక్షమాలా ధరాం
గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీతీర్థశక్తిం భజే||
అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి.
తరువాత పంపాకలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి.
పంపాకలశ స్థిత శ్రీ గంగా మహాదేవీ ఇహప్రాణ ఇహజీవ ఇహజీవ ఇహాగచ్చ|
సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహా||
స్థిరభవ|| వరదాభవ| సుముఖీభవ| సుప్రసన్నాభవ| ప్రసీద ప్రసీద ప్రసీద||
అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలశ పూజ చేయాలి.
పూజ మీకు వచ్చిన విధంగా చేసుకోగలరు.
*వ్రత కథ 🌼🌿*
శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు.
అప్పుడు ఆయన కధ చెప్పాడు.
వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు.
వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు, అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు.
అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం.
దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు.
వ్యాస భగవానుల ఆదేశం మేరకు పాండవులు ఈ వ్రతం ఆచరించారు.
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏