నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🎋పంచాంగం🎋
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 01 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *విదియ* తె3.46 వరకు,
నక్షత్రం : *పుష్యమి* ఉ11.11 వరకు,
యోగం : *ప్రీతి* రా2.57 వరకు,
కరణం : *తైతుల* మ3.44 వరకు
తదుపరి *గరజి* తె3.46 వరకు,

వర్జ్యం : *రా12.26 – 2.06*,
దుర్ముహూర్తము : *ఉ11.47 – 12.31*,
అమృతకాలం : *లేదు,*
రాహుకాలం : *మ12.00 – 1.30*,
యమగండం : *ఉ7.30 – 9.00*,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.41,

*_నేటి విశేషం_*

*కనుమ పండుగ*
*కనుమ పండుగ విశిష్టత*
సంక్రాంతి తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ,
కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా జరుపుకుంటారు.
ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు, ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు.
అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము…

కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిదని చెబుతారు, ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారంగా పాటిస్తారు.

ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు.
ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు.
పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం, ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు బెలూన్లతో అందంగా అలంకరించి కాళ్ళకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు.
ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు.

వారికి పంట పండించడంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు.
అయితే కొన్ని పల్లెల్లో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది.

ఈ రోజున మినుములు తినాలనే ఆచారముంది, అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు.

ఈ రోజున ఇంటికి వచ్చిన ఆడపడుచును, కొత్త అల్లుళ్లను తిరుగు ప్రయాణం చేయనివ్వరు.
ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది.
గాలి పటాలు ఎగుర వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను జరుపుకుంటారు.

కనుమ రోజున పెరుగును దానం చేస్తే విశేష ఫలితం పొందుతారని నమ్ముతారు.

కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు, కోడిపందాలు నిర్వహిస్తుంటారు.
వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం.
ఈ కనుమ పండుగ వాతావరణం అంతా పల్లెటూరిలో అందంగా కనిపిస్తుంది.

ఇలా సంక్రాంతి చివరి రోజులు జరుపుకునే కనుమ రోజుతో సంక్రాంతి పండుగ పూర్తవుతుంది.
కనుమ పండుగ రోజున రైతులు పంట పండించడంలో సహాయపడిన పశువులను అందంగా అలంకరించి వాటికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం.
అందుకే కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు.

స్వస్తి🙏

*_🎋శుభమస్తు🎋_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏